జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే.. ఎలా వచ్చాయంటే?

జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్‌ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి రజనీకాంత్ ప్రవీణ్ జిల్లాలో డీఈవోగా విధులు నిర్వర్తిస్తూ దాదాపు 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే.. ఎలా వచ్చాయంటే?
Bettiah Deo Rajinikanth Praveen

Updated on: Jan 23, 2025 | 5:57 PM

బిహార్‌లో అవినీతి పుట్ట పగిలింది. కట్టల పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. యస్‌. ఓ అవినీతి అధికారి ఇంటిపై రైడ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులకు కూడా కళ్లు బైర్లు కమ్మే రేంజ్‌లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. కొండలా దర్శనమిస్తున్న నోట్ల కట్టలు…ఎంత లెక్కపెట్టినా తరగనంటున్నాయి.

జిల్లా విద్యాశాఖాధికారి నివాసంలో గురువారం(జనవరి 23) విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. బీహార్‌లోని బెట్టియాలో అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ అధికారుల బృందం ఏకకాలంలో పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున నగలు, నగదు కుప్పలు తెప్పలుగా బయపడ్డాయి. ఈ ఘటన జిల్లా విద్యాశాఖలో తీవ్ర కలకలం రేపింది.

పాట్నా నుంచి వచ్చిన విజిలెన్స్ బృందం బెట్టియా జిల్లా విద్యాశాఖాధికారి రజనీకాంత్ ప్రవీణ్ ఇంటిపై ఉదయం నుంచి దాడులు చేసింది. రజనీకాంత్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారలు విచారిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రజనీకాంత్ ప్రవీణ్ నివాసంలో విజిలెన్స్ బృందం స్థానిక పోలీసుల నుండి నోట్ లెక్కింపు యంత్రాన్ని ఆర్డర్ చేసింది. ఉదయం నుంచి డీఈవో ఇంటిపై విజిలెన్స్‌ సోదాలు కొనసాగుతున్నాయి.

బెట్టియా జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్‌ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి రజనీకాంత్ ప్రవీణ్ జిల్లాలో డీఈవోగా విధులు నిర్వర్తిస్తూ దాదాపు 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు.

బీహార్ ప్రాంతంలోని రజనీకాంత్ ప్రవీణ్ బసంత్ ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. దీంతో కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం. ఇంటి లోపల పోలీసు బలగాలను మోహరించారు. అందిన సమాచారం మేరకు విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్‌కు చెందిన ఇంటితోపాటు పలు చోట్ల పోలీసులు, విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..