Manish Sisodia: అలా చేస్తే కేసులన్ని మాఫీ.. బీజేపీ ‘ఆఫర్’ చేసిందని మనీష్ సిసోడియా వెల్లడి

మ్యదం విధానంలో అవకతవకల ఆరోపణలు ఢిల్లీలో బీజీపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను పై అక్రమ కేసులు బనాయించారని ఆప్ ఆరోపిస్తుంటే.. మద్యం విధానంలో అవకతవకలపై నైతిక..

Manish Sisodia: అలా చేస్తే కేసులన్ని మాఫీ.. బీజేపీ ‘ఆఫర్’ చేసిందని మనీష్ సిసోడియా వెల్లడి
Manish Sisodia

Updated on: Aug 22, 2022 | 4:12 PM

Manish Sisodia: మ్యదం విధానంలో అవకతవకల ఆరోపణలు ఢిల్లీలో బీజీపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను పై అక్రమ కేసులు బనాయించారని ఆప్ ఆరోపిస్తుంటే.. మద్యం విధానంలో అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పోటా పోటీ ఆరోపణల నేపథ్యంలో మనీష్ సిసోడియా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసులు మాఫీ చేస్తామంటూ ఆఫర్ బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. .ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తే.. తనపై ఉన్న అన్ని కేసులు కొట్టేస్తామంటూ హామీ ఇచ్చారన్నారు. ఈవిషయాన్ని మనీష్ సిసోడియా నేరుగా ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు బీజేపీ నుంచి ఓ సందేశం వచ్చిందని, సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్ని క్లోజ్ చేసేందుకు బీజేపీలో చేరాలని ఆ సందేశంలో కోరినట్లు తెలిపారు. అయితే ఆ సందేశం ఎవరి నుంచి వచ్చిందనేది పేరును వెల్లడించలేదు. తాను రాజ్ పుత్ నని, మహా రాణా ప్రతాప్ వారసుడినని, తలనైనా నరుక్కుంటాను కానిచ అవినీతి, కుట్రదారుల ముందు తలవంచబోనని ట్వీట్టర్ లో స్పష్టంచేశారు. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే, మీరు ఏంచేయాలనుకుంటే అది చేసుకోండి.. నాకొచ్చిన సందేశానికి ఇదే నా సమాధానం అంటూ మనీష్ సిసోడియా ఘాటుగా స్పందించారు.

ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరబ్ భరద్వాజ్ స్పందిస్తూ.. మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయని.. వాటిని ఆయన లెక్క చేయలేదన్నారు. బీజేపీ బెదిరింపులకు ఆమ్ ఆద్మీ భయపడబోదన్నారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది నవంబర్ లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానంలో అనేక అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘనతో పాటు.. విధానపరమైన లోపాలున్నాయని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఢిల్లీ లెప్టింనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేశారు. దీంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లు, ప్రాంగణాలపై సీబీఐ అధికారులు సోదాలు చేశారు. అలాగే మనీష్ సిసోడియాతో పాటు మద్యం విధానంలో అవకతకవల ఆరోపణలెదుర్కొంటున్న కేసులో 8మందిపై లుకౌట్ నోటీసులు సీబీఐ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మద్యం విధానంలో అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షులు ఆదేశ్ గుప్తా నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సివిల్ లైన్స్ లోని అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట పెద్ద ఎత్తున్న బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పోటాపోటీ విమర్శలు, ఆరోపణలతో హస్తినలో రాజకీయం వాతావరణం వేడెక్కుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..