దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఎంటర్ అయ్యింది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం నాడు కొత్త పార్టీని ప్రకటించారు. “ఆజాద్ సమాజ్ పార్టీ” గా కొత్త పేరు పెడుతూ.. అధికారికంగా ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా.. ఓ కార్యక్రమంలో చంద్రశఏఖర్ ఆజాద్ ఈ కొత్త పార్టీ పేరును వెల్లడించారు.
బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేపట్టిన మిషన్ పూర్తవ్వలేదని.. దాన్ని పూర్తిచేయడానికే ఈ కొత్త పార్టీని ప్రారంభించినట్లు చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరాం చేపట్టిన మిషన్ పూర్తిచేస్తుందంటూ ట్వీట్ చేశారు.
2022లో జరిగే యూపీ ఎన్నికల్లో అధికారం మరోసారి చేజిక్కించుకోవడం కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభిస్తుంటే.. మరోవైపు బీజేపీని ఎదుర్కొని.. అధికారం దక్కించుకునేందుకు ఎస్పీ, బీఎస్పీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుతో యూపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. కాగా.. చంద్రశేఖర్ ఆజాద్ కొత్త పార్టీ ప్రకటించిన రోజే.. ఎస్పీ,బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరారు.