గుడ్‌న్యూస్‌.. ‘కొవాగ్జిన్’‌ తొలి దశ ప్రయోగం విజయవంతం

| Edited By:

Aug 14, 2020 | 11:52 AM

కరోనాకు చెక్ పెట్టేందుకు భారత్‌ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌ తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. మొదటి దశలో భాగంగా

గుడ్‌న్యూస్‌.. కొవాగ్జిన్‌ తొలి దశ ప్రయోగం విజయవంతం
Follow us on

Covaxin First trail: కరోనాకు చెక్ పెట్టేందుకు భారత్‌ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌ తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. మొదటి దశలో భాగంగా దేశంలోని 12 ప్రాంతాల్లో మొత్తం 375 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందివ్వగా, మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో రెండో దశ పట్రయల్స్‌కి కోవాగ్జిన్‌ సిద్ధమవుతోంది. అయితే భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్‌ కొవాగ్జిన్ టీకాను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ సంబంధించి మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషద నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతిని ఇవ్వగా.. తాజాగా తొలి దశను విజయవంతం చేసుకుంది. అన్ని దశల్లో ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే.. దేశ ప్రజలకు నిజంగా శుభవార్తనే అవుతోంది. దేశీయంగా అభివృద్ది చేస్తున్న తొలి వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ కాగా.. అందరి దృష్టి దీనిపైనే ఉంది.

 

Read More:

ఏపీలో ‘ఇంటింటికీ బియ్యం’.. సిద్ధమైన వాహనాలు

సుశాంత్ మృతి: మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్య స్వామి