Bengaluru: రూ.20 లక్షల విలువైన బంగారు నగలున్న సూట్‌కేస్‌ పోగొట్టుకున్న రైల్వే ప్రయాణికుడు! గంటల వ్యవధిలోనే..

|

Apr 07, 2022 | 12:45 PM

ఓ రైల్వే గార్డుకు (Bengaluru Home Guard) కూడా అనుకోకుండా బంగారు ఆభరణాలు ఉన్న సూట్‌ కేస్‌ దొరికింది. ఐతే అతను వెంటనే సూట్‌ కేసు తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే ..

Bengaluru: రూ.20 లక్షల విలువైన బంగారు నగలున్న సూట్‌కేస్‌ పోగొట్టుకున్న రైల్వే ప్రయాణికుడు! గంటల వ్యవధిలోనే..
Gold Jewellery
Follow us on

A train passenger lost Suite case worth Rs 20 lakh, surprisingly he got it back: హఠాత్తుగా మీకు బోలెడంత బంగారం దొరికితే ఏం చేస్తారు? ఈ జీవితానికి దరిద్రం తీరిపోయిందిలేనని లటుక్కున దాచేస్తారా.. లేదా ఎవరు పోగొగ్గుకున్నారో తెలుసుకుని భద్రంగా వారి చేతికి అప్పగిస్తారా? బుద్ధిని బట్టి నిర్ణయం ఉంటుంది అవునా! సరిగ్గా ఇలానే.. ఓ రైల్వే గార్డుకు (Bengaluru Home Guard) కూడా అనుకోకుండా బంగారు ఆభరణాలు ఉన్న సూట్‌ కేస్‌ దొరికింది. ఐతే అతను వెంటనే సూట్‌ కేసు తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే యజమానికి అప్పగించి అందరి ప్రశంశలు పొందాడు. నిజమండీ..! ఎక్కడ జరిగిందంటే..

అధికారిక సమాచారం ప్రకారం.. మైసూర్ అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో మైసూరుకు ప్రయాణించడానికి రమేష్ చంద్ అనే వ్యక్తి, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం (ఏప్రిల్‌ 5) రాత్రి 9.30 గంటలకు కేఎస్‌ఆర్‌ బెంగళూరు రైల్వే స్టేషన్‌ (KSR Bengaluru Railway Station) చేరుకున్నాడు. ఐతే అతనితోపాటు సామాన్లతో నిండిన 20 బ్యాగులు కూడా ఉన్నాయి. రెండు గంటల తర్వాత వాటిల్లో ఒక సూట్ కేస్‌ కనిపించట్లేదని గ్రహించాడు. పోగొట్టుకున్న సూట్‌ కేస్‌లో దాదాపు రూ. 20 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. ఆభరణాలున్న సూట్‌కేస్ కనిపించకపోవడంతో వెంటనే బెంగళూరులోని కేఎస్‌ఆర్‌ జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివన్న కేసు ఫైల్‌ చేసి ఇతర పోలీసులకు హుటాహుటిన సమాచారం అందించాడు. అదే స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న గురురాజ్‌కు సూట్‌ కేసు దొరకడంతో, గంటల వ్యవధిలోనే దాన్ని యజమానికి అందజేశారు. దీంతో సదరు హోంగార్డును రైల్వే పోలీసులు, అతని సీనియర్లు ప్రశంశల్లో ముంచేశారు. రైలు ప్రయాణికుడు రమేష్ చంద్ హోం గార్డుకు ఆనందంతో కృతజ్ఞతలు తెలిపాడు.

Also Read:

AP AMVI Jobs: ఏపీ హైకోర్టు ఆసక్తికర తీర్పు! సమతల పాదమున్న వ్యక్తులు ఆ ఉద్యోగానికి అనర్హులు..