
వీకెండ్ వస్తే చాలు పార్టీ జరగాల్సిందే..! ఫామ్‌హౌస్‌కి వెళ్లాలి.. ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి..! ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు 31 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ను చిక్కుల్లో పడేసింది. రేవ్ పార్టీపై సమాచారం అందడంతోనే రంగంలోకి దిగిన పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.. ఆ తర్వాత లోపలికి వెళ్లగా.. అమ్మాయిలు.. అబ్బాయిలు జోష్ మీద ఉన్నారు. మందు చిందు.. డ్రగ్స్.. అబ్బో.. మామూలుగా లేదు యవ్వారం అన్నట్లు ఉంది.. దీంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేవ్ పార్టీ కలకలం రేపిన ఘటన కర్నాటక దేవనహళ్లిలో చోటుచేసుకుంది..
బెంగళూరులోని కన్నమంగళ గేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన పుట్టినరోజు వేడుకలో మాదకద్రవ్యాలు సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 31 మందిని అరెస్టు చేశారు. వీరిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. కన్నమంగళ దగ్గర్లోని ఫామ్‌హౌస్‌లో రాత్రంతా పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికులు ఈపార్టీపై సమాచారం ఇవ్వడంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగి.. తెల్లవారు జామున ఐదు గంటలకు ఫామ్‌హౌస్‌లో అన్ని చోట్లా సోదాలు చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. అదుపులోకి తీసుకున్న వారిలో ఏడుగురు యువతులు ఉన్నారని, వారిలో ఒక చైనా జాతీయురాలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. దాదాపు హాజరైన వారందరూ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఐటీ నిపుణులని అధికారులు చెబుతున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో మాదకద్రవ్యాల వినియోగదారులు, సరఫరాదారులు ఇద్దరూ ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ ఈస్ట్ జోన్) వీజే సజీత్ పీటీఐకి తెలిపారు. అరెస్టు చేసిన వారి నుండి రక్తం, మూత్ర నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపారు. రిపోర్టు అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. రేవ్ పార్టీలో 31 మంది పాల్గొన్నారని.. ఈ దాడిలో కొద్ది మొత్తంలో కొకైన్, హాషిష్, హైడ్రో గంజాయి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని సజీత్ తెలిపారు.
The Bengaluru Police on Sunday (May 25) busted a rave party – promoted as a birthday party – at a farmhouse in Devanahalli. Seven IT professionals are among 31 people arrested in connection with the case.
The police have seized cocaine, ganja, charas, opium, hyderoganja,… pic.twitter.com/oilaqgu9Ri
— News9 (@News9Tweets) May 26, 2025
బెంగళూరు శివారులోని ప్రాంతం కావడంతో దేవనహళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇక్కడ వీకెండ్ పార్టీలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి పార్టీలపై పోలీసులు కొరడ ఝుళిపిస్తున్నారు పోలీసులు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..