Bengaluru Fridge Horror: ‘చాలా విసిగిపోయాను.. అందుకే చంపి, 59 ముక్కలు చేశా..’ నిందితుడి సూసైడ్‌ నోట్‌లో షాకింగ్‌ విషయాలు

|

Sep 26, 2024 | 4:58 PM

బెంగళూరు మహాలక్ష్మి (26) అనే వివాహితను 59 ముక్కలుగా నరికిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడు ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి, అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. వారి అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు..

Bengaluru Fridge Horror: చాలా విసిగిపోయాను.. అందుకే చంపి, 59 ముక్కలు చేశా.. నిందితుడి సూసైడ్‌ నోట్‌లో షాకింగ్‌ విషయాలు
Bengaluru Woman Murder Case
Follow us on

బెంగళూరు, సెప్టెంబర్ 26: బెంగళూరు మహాలక్ష్మి (26) అనే వివాహితను 59 ముక్కలుగా నరికిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడు ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి, అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. వారి అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ముక్తిరాజన్ రాయ్ మృతురాలి సహోద్యోగి అని, హత్యకు పాల్పడింది అతడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహాలక్ష్మిని హత్యచేసింది తానేనని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అతని డైరీలో డెత్ నోట్ రాసి ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3న మహాలక్ష్మి ఇంటికి వెళ్లి, ఆమెను హత్య చేసినట్లు నిందితుడు తన డైరీలో రాశాడు. అందులో ఏముందంటే..’ఆమె ప్రవర్తనతో నేను చాలా విసిగిపోయాను. ఇదే విషయమై ఆమెతో గొడవపడగా, మహాలక్ష్మి నాపై దాడి చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన నేను క్షణికావేశంలో ఆమెను హత్య చేశాను. ఆమెను చంపిన తర్వాత, నేను ఆమె శరీరాన్ని 59 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచాను. ఆమె ప్రవర్తనతో విసిగిపోయే ఈ పని చేశాను’ అని డైరీలో పేర్కొన్నాడు. హంతకుడు ముక్తిరంజన్ రాయ్ నివాసంలో సూసైడ్‌ నోటు దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ఓ గ్రామంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ముక్తిరంజన్‌ బుధవారం పాండి గ్రామానికి వచ్చి తన ఇంట్లో కొంత సమయం ఉండి, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరిన అతడు గ్రామంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

కాగా సంచలనం సృష్టించిన ఈ హత్య ఘటన తర్వాత ముక్తిరంజన్ అదృశ్యమయ్యాడు. అతడి కోసం కర్ణాటక పోలీసులు నాలుగు బృందాలను ఒడిశాకు పంపారు. అయితే అతడు సెప్టెంబర్ 1 నుంచే మాల్‌కు రావడం మానేశాడు. మహాలక్ష్మి కూడా సెప్టెంబర్ 1 తర్వాత అదృశ్యమైంది. దీంతో ఆమెను సెప్టెంబర్ 2 లేదా సెప్టెంబర్ 3న మహాలక్ష్మిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా మహాలక్ష్మి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు గమనించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో గత శనివారం ఈ హతోదంతం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మి తల్లి, సోదరి శనివారం ఆమె ఇంటికి వచ్చి చూడగా భయానక దృశ్యం వారికి కనిపించింది. మహాలక్ష్మిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఫ్రిజ్ వద్ద సూట్‌కేస్ కూడా దొరికింది. మహాలక్ష్మిని హత్య చేసేందుకు వినియోగించిన కత్తిలాంటి పదునైన ఆయుధం అందులో లభ్యమైంది. దీనితోనే ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురకు చెందిన మహాలక్ష్మి అక్కడి ఓ బట్టల మాల్‌లో పనిచేసింది. ఐదు నెలలుగా నివసిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమెకు వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. అయితే భర్తతో విడిపోయి అక్కడ ఒంటరిగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.