కర్ణాటక రాజధాని బెంగళూరులో స్కూల్ పిల్లల బస్సుపై దాడికి పాల్పడింది ఓ ముఠా. స్కూల్ బస్సు తమ కారును ఓవర్‌టేక్ చేశారంటూ ఆ గుంపు బస్సు, డ్రైవర్‌పై దాడి చేసింది. పాఠశాల విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఈ ఘటన ఎలక్ట్రానిక్ సిటీలో గత వారం జరిగింది. నడిరోడ్డుపై స్కూల్ బస్సును అడ్డగించిన కొందరు వ్యక్తులు ముందుగా డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 సమీపంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఓ స్కార్పియో కారు, బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు పాఠశాల బస్సును అడ్డగించారు. ఇనుప రాడ్లు వంటి బలమైన వస్తువులతో బస్సు కిటికీలను ధ్వంసం చేశారు. అనంతరం డ్రైవర్‌పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక గుంపు డ్రైవర్‌ను బస్సు నుండి బయటకు దింపేసి రోడ్డుపై కొట్టడం కనిపించింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో విద్యార్థులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ వీడియో చూడండి..
In Bengaluru, the safety of school children has come into serious question following a distressing incident today. At around 4 PM, a school bus on Route 35, operated by Treamis School in Electronic City, was viciously attacked by a group of goons. The attackers, numbering between… pic.twitter.com/dayz8bG8OZ
— Karnataka Portfolio (@karnatakaportf) September 16, 2024
కర్ణాటక పోర్ట్‌ఫోలియో అనే X హ్యాండిల్ వీడియోను షేర్ చేసింది. సాయంత్రం 4 గంటలకు, ఎలక్ట్రానిక్ సిటీలోని ట్రీమిస్ స్కూల్ నడుపుతున్న రూట్ 35లో ఒక స్కూల్ బస్సుపై ఓ రౌడీ ముక దారుణంగా దాడి చేసింది. దాదాపు 10 మంది వరకు ఉన్న గ్యాంగ్ స్కార్పియోలో వస్తూ స్కూల్ బస్సుపై దాడికి పాల్పడ్డారు. వీడియో నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..