మరీ ఇంత దారుణమా..? సిగరెట్లు ఇవ్వలేదని.. కారుతో ఢీ కొట్టి చంపేశాడు!

బెంగళూరులోని కోననకుంటె క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిగరెట్టు అడుగుతున్న వ్యక్తికి ఇవ్వకపోవడంతో ఇద్దరు యువకులను కారు తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించగా మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు.

మరీ ఇంత దారుణమా..? సిగరెట్లు ఇవ్వలేదని.. కారుతో ఢీ కొట్టి చంపేశాడు!
Bengaluru Hit And Run

Updated on: May 17, 2025 | 8:53 PM

సిగరెట్లు తీసుకురాలేదని ఒక యువకుడిని కారుతో ఢీకొట్టి చంపిన సంఘటన బెంగళూరులోని కోననకుంటే క్రాస్ సమీపంలో జరిగింది . ఈ సంఘటన శనివారం (మే 10) తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. ఈ ఘోర ప్రమాదం సీసీటీవీలో రికార్డైంది. ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంజయ్ మరణించాడు. మరో యువకుడు చేతన్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్, నిందితుడు ప్రతీక్‌ను సుబ్రహ్మణ్యపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్ మరియు చేతన్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. నైట్‌ షిఫ్ట్‌ ముగించుకొని ఇంటికి వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 4 గంటలకు కోననకుంటె క్రాస్ సమీపంలోని తోపుడు బండి దగ్గర నిలబడి టీ తాగుతున్నాడు.

అదే సమయంలో ప్రతీక్ దంపతులు తమ పుట్టినరోజు పార్టీని ముగించుకుని క్రెటా కారులో ఆర్ఆర్ నగర్‌లోని తమ ఇంటికి తిరిగి వస్తున్నారు. కోననకుంటె క్రాస్ దగ్గర తన కారు పార్క్ చేసిన నిందితుడు ప్రతీక్ అక్కడే ఉన్న సంజయ్, చేతన్‌లను సిగరేట్‌ అందివాలని కోరాడు. కానీ వాళ్లు అలా చేయడానికి నిరాకరించారు. “నీకు కావాలంటే, నువ్వే వచ్చి తీసుకో” అన్నారు. దీంతో మాటామాట పెరిగి వారి మధ్య గొడవ జరిగింది. స్థానికులు గొడవను ఆపారు. తరువాత, యువకులు యమహా R15 బైక్ ఎక్కి బయలుదేరారు. సంజయ్ బైక్ నడుపుతుండగా చేతన్ అతని వెనుక కూర్చున్నాడు.

వారు యూ-టర్న్ తీసుకుంటుండగా ప్రతీక్‌ కారులో వచ్చి వారిని ఢీకొట్టాడు. దీంతో బైక్ దుకాణం షట్టర్‌ను ఢీకొట్టింది. సంజయ్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడున్న వారు అతన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స విఫలమై రెండు రోజుల క్రితం సంజయ్ మరణించాడు. మృతుడు సంజయ్ హసన్ కు చెందినవాడు. గాయపడిన చేతన్ ఉత్తర కన్నడకు చెందినవాడు. సుబ్రహ్మణ్యపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడు ప్రతీక్‌ను అరెస్టు చేశారు. నిందితుడు ప్రతీక్ మాగడి రోడ్డులోని ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..