Bengaluru Floods: వరదలకు బెంగళూరు ఉక్కిరిబిక్కిరి.. నేటి ఈ దుస్థితికి కారణాలు ఏంటి?

Bengaluru Floods News: బెంగళూరులో నెలకొన్న దుస్థితికి కారణం ఏంటి? కాలువలు, డ్రైనేజీలు ఆక్రమణలకు గురవడమే దీనికి కారణమా?

Bengaluru Floods: వరదలకు బెంగళూరు ఉక్కిరిబిక్కిరి.. నేటి ఈ దుస్థితికి కారణాలు ఏంటి?
Rains In Bangaluru

Updated on: Sep 07, 2022 | 11:23 AM

Bengaluru Floods: బెంగళూరు ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎన్నడూ లేని విధంగా సిలికాన్‌ సిటీ మునిగిపోయింది.  పలు కాలనీలు నీట మునిగాయి.బుధవారంనాటికి కూడా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. లక్షలాది మందికి వరద కష్టాలు తప్పడం లేదు. ట్రాక్టర్ల, జేసీబీల సాయంతో కొందరు ఐటీ ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకున్నారు. పలు లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. ఈ దుస్థితికి కారణం ఎవరన్న దానిపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  బెంగళూరులో నెలకొన్న దుస్థితికి కారణం ఏంటి? కాలువలు, డ్రైనేజీలు ఆక్రమణలకు గురవడమే దీనికి కారణమా?

బెంగళూరులో వరదలు పోటెత్తడానికి కారణాలపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా ఈ 5 కారణాలు వరదలకు కారణంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

1. కాలువలు ఆక్రమణలకు గురవడం. చెత్తతో చెరువులు పూడిపోవడం
2. చెరువులు,సరస్సులను డెడ్‌లేక్స్‌ పేరుతో నోటిఫై చేయకుండా వదిలేయడం
3. డ్రైనేజీలు,కాలువలను కబ్జా చేసి నిర్మాణాలు చేయడం
4. బహిరంగ ప్రదేశాలు,చిత్తడి నేలలు వృక్షసంపద తగ్గిపోవడం
5. ప్రణాళిక లేని బాధ్యతారహితమైన పట్టణీకరణ

బెంగుళూరు మహా నగరంలో ఇష్టం వచ్చినట్టు భవనాలు నిర్మించడంతో పెద్ద ఎత్తున భూ విస్తీర్ణంలో మార్పులు వచ్చాయి. దీంతె పర్యావరణ క్షీణత ఏర్పడిందని, వృక్షసంపద 1973లో 68% ఉండా…2020లో 3%కి క్షీణించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ దుస్దితే వరదలను మరింత తీవ్రతరం చేసిందన్నారు.డ్రెనేజ్‌లు డంప్‌ యార్డ్‌లుగా మారిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు…వరదలు వచ్చాక చెత్తను తొలగిస్తున్నారు. మురికినీటి కాలువలపై అక్రమ నిర్మాణాలు చేయడమే కాకుండా… వరద నీరు పోవడానికి ఎలాంటి అవుట్‌లెట్స్‌ లేకుండా చేయడంతో వరద ముంచెత్తింని చెబుతున్నారు.మున్సిపల్ అధికారుల అండదండలతో ఇష్టం వచ్చినట్టు ఆక్రమణలు జరిగాయని బెంగళూరు వాసులు ఆరోపిస్తున్నారు. డ్రెయిన్లను శుభ్రం చేయడంలో నగర పాలికె సంస్థ కూడా అలసత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు.

వరదలతో దెబ్బతిన్న నగరాన్ని పునరుద్ధరించడాన్ని తమ ప్రభుత్వం సవాలుగా తీసుకుందని సీఎం బసవరాజు బొమ్మై అన్నారు.  భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వం దుష్పరిపాలన కారణమన్నారు.

ఇదిలా ఉండగా బెంగుళూరులో వరదలకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ అపార్టమెంట్‌ బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన కార్లన్నీ వరదనీటిలో మునిగిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రాక్టర్ల సాయంతో తమ కార్యాలయాలకు చేరుకుంటున్న ఐటీ ఉద్యోగులు..

బెంగుళూరులో నీట మునిగిన నివాస ప్రాంతం.. వీడియో

 

మరిన్ని జాతీయ వార్తలు చదవండి