Bengal polls 2021: బెంగాల్‌లో బీజేపీ మద్దతుదారుడి తల్లి హత్య.. టీఎంసీపై నేతల ఆరోపణలు

|

Apr 06, 2021 | 1:13 PM

Woman BJP supporter killed in Goghat: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. మంగళవారం 7గంటల నుంచి మూడవ దశ పోలింగ్

Bengal polls 2021: బెంగాల్‌లో బీజేపీ మద్దతుదారుడి తల్లి హత్య.. టీఎంసీపై నేతల ఆరోపణలు
West Bengal Election 2021
Follow us on

Woman BJP supporter killed in Goghat: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. మంగళవారం 7గంటల నుంచి మూడవ దశ పోలింగ్ కొనసాగుతోంది. అయితే పోలింగ్‌కు ముందు హుగ్లీలోని గౌఘాట్‌లో హింసాయుత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీకి మద్దతు పలుకుతున్న వ్యక్తి తల్లి మృతి చెందింది. ఆమె మృతికి తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోమవారం హుగ్లీలోని గౌఘాట్‌లో బదగంజ్ ప్రాంతంలో బీబీజే, తృణముల్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో బీజేపీకి మద్దతు పలుకున్నతున్న వ్యక్తి తల్లి మాధవి అధక్ (43) పై దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించిందని బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్షణకు దిగిన బీజేపీ, టీఎంసీ కార్యకర్తలను చెదరగొట్టారు.

ఈ ఘటనపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతురాలు మాధవి కుమారుడు బీజేపీ మద్దతుదారుడని, దీంతో కావాలనే టీఎంసీ కార్యకర్తలు వారి ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. కాగా ఈ వార్తలను తృణముల్ ఖండించింది.

Also Read:

West Bengal Assembly Election 2021 Live: రసవత్తరంగా బెంగాల్, అస్సాం ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్..

Kareena Kapoor Second Baby: కరీనా-సైఫ్ రెండో బేబీ ఫొటో లీక్.. ఎవరు షేర్ చేశారో తెలిస్తే షాకే.. వైరల్