
బళ్లారి నగరంలోని కణేకల్ రోడ్డులోని రాణితోట వద్ద ఏప్రిల్ 4 న జరిగిన వెంకటేష్ ఎన్నువతన హత్య కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. వెంకటేష్‌ను హత్య చేసింది మరెవరో కాదు, అతని భార్యే అని తేలింది. ఆమె తన ప్రేమికుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేయించి.. తర్వాత ఏం తెలియనట్లు.. అయ్యో నా భర్తను ఎవరో చంపేశారే అంటూ మొసలి కన్నీళ్లు కార్చింది. కానీ, పోలీసుల విచారణలో నిజం బయటపడింది. ఏప్రిల్ 4 తెల్లవారుజామున బళ్లారి నగరంలోని కనేకల్ రోడ్డులోని రాణితోట ప్రాంతంలో వెంకటేష్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. దుండగులు వెంకటేష్ బట్టలన్నీ విప్పి, తలపై కొట్టి, హత్య చేసి, తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసుకు సంబంధించి మృతుడు వెంకటేష్ భార్య బ్రూస్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసు దర్యాప్తులో ఫిర్యాదు చేసిన మృతుడి భార్యే ఈ మొత్తం హత్య కేసు వెనుక ప్రధాన సూత్రధారి అని తేలింది. మృతుడి భార్య నీల్వేణి, తన ప్రేమికుడితో కలిసి స్కెచ్ వేసి భర్తను హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా నిలుస్తాడని ఈ దారుణానికి పాల్పడింది. వెంకటేష్, నీల్వేణికి 16 ఏళ్ల క్రితంఅయింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ నీల్వేణికి షామియా వ్యాపారం నడుపుతున్న ఆనంద్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వెంకటేష్ కు తన భార్య అనైతిక సంబంధంపై అనుమానం వచ్చింది. ఇదే క్రమంలో ఆనంద్, వెంకటేష్ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి షామియానా ఏర్పాటు చేశాడు. అప్పుడే ఆమె భర్త వెంకటేష్.. నీల్వేణి, ఆనంద్ మధ్య సంబంధం గురించి గొడవ ప్రారంభించాడు. శుక్రవారం రాత్రి నీల్వేణి తన భర్త వెంకటేష్‌ను చంపడానికి ఆనంద్‌తో కలిసి స్కెచ్ వేసింది. ఆ తర్వాత ఆనంద్ తన స్నేహితులతో కలిసి వెంకటేశ్‌ను హత్య చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.