సుశాంత్ సింగ్ కేసుతో తనకు సంబంధం లేదని బాలీవుడ్ నటుడు సూరజ్ పాంచోలీ స్పష్టం చేశాడు. సుశాంత్ మృతికి, తనకు లింక్ పెడుతున్నారని, కానీ ఇది తప్పని పేర్కొన్నాడు. ఫేస్ బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో తనపై ఎన్నో అభ్యంతరకర కామెంట్లు, మెసేజ్ లు పెడుతున్నారంటూ ఆయన ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సూరజ్ పాంచోలీ తల్లి జరీనా వాహబ్ కూడా తన కుమారుడికి, సుశాంత్ మృతికి అసలు సంబంధమే లేదని పేర్కొన్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.
కాగా-సుశాంత్ మృతికి ముందు సూరజ్ పాంచోలీ ఇంట్లో జరిగిన పార్టీకి చాలామంది సెలబ్రిటీలు, పొలిటిషియన్లు హాజరయ్యారని బీజేపీ నేత నారాయణ్ రాణే ఇటీవల వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.