దారుణం.. మోదీకి జై కొట్టనందుకు చితకబాదారట..!

దారుణం.. మోదీకి జై కొట్టనందుకు చితకబాదారట..!

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్‌ను ఇద్దరు వ్యక్తులు చితక బాదారు. రాష్ట్రంలోని సికార్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గఫార్‌ అహ్మద్‌ అనే ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌గా..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 6:39 AM

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్‌ను ఇద్దరు వ్యక్తులు చితక బాదారు. రాష్ట్రంలోని సికార్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గఫార్‌ అహ్మద్‌ అనే ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడితో ఓ విషయంలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో అతడిని మోదీ జిందాబాద్‌, జై శ్రీరాం అంటూ నినాదాలు చేయాలన్నారు. అయితే గఫార్‌ అందుకు నిరాకరించడంతో ఆయన చెంపపై కొట్టారు. దీంతో వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగా.. ఆ ఇద్దరు వ్యక్తులు అతడిని వెంబడించి చితక బాదారు. బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట చేశారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu