బెంగళూరులో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలిని కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపాడు . ఆమెపై 16కు పైగా కత్తిపోట్లు పడినట్టుగా తెలుస్తోంది. ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే నిందితుడు దినకర్, యువతి లీలా పవిత్ర ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందినవారు. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి పెళ్లికి లీలా పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో.. తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఆ యువతి పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరే.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దినకర్. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదనో, తనతో పెళ్లికి ఒప్పుకోలేదనో, అత్యంత కిరాతకంగా నిండు ప్రాణం తీశాడు.
కాగా తన దాడిలో లీలా మృతి చెందిన తర్వాత.. ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు దినకర్. జీవన్ భీమా నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దినకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దినకర్ దోమలూరులోని ఓ కంపెనీలో హెల్త్‌కేర్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..