Air India: టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే రిటర్న్.. ఒక్కసారిగా పనిచేయటం మానేసిన విమాన ఇంజిన్..

|

May 22, 2022 | 5:19 PM

Air India: టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఒక విమానం గాలిలో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో రకం విమానంలో..

Air India: టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే రిటర్న్.. ఒక్కసారిగా పనిచేయటం మానేసిన విమాన ఇంజిన్..
Air India
Follow us on

Air India: టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఒక విమానం గాలిలో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 నియో రకం విమానంలో ఎదురైన సాంకేతిక కారణాల రీత్యా విమానం అత్యవసరంగా ముంబయి విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఒక్కసారిగా తలెత్తిన సాంకేతిక ఇబ్బంది వల్ల విమానంలోని ఒక ఇంజిన్ మెురాయించి పనిచేయటం ఆగిపోయింది. విమానాశ్రయం నుంచి బెంగళూరు ప్రయాణించేందుకు టేకాఫ్ అయిన ఈ విమానంలో 27 నిమిషాల తరువాత సాంతేతిక సమస్య ఎదురైంది. దీంతో వెనక్కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను వేరొక విమానంలో సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు గల కారణాలపై డీజీసీఏ విచారణ జరుపుతోంది.

సీఎఫ్ఎమ్ ఇంజిన్లు కలిగి ఉండే ఈ విమానం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం బయలు దేరింది. ఆ తరువాత సుమారు 9.43 గంటలకు ఇంజిన్ మెురాయించినట్లు పైలెట్ సమాచారం అందించాడు. దీంతో తిరుగు ప్రయాణం మెుదలు పెట్టిన విమానం కొన్ని నిమిషాల్లో 10.10 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ అయింది. తాము ఎల్లప్పుడూ ప్రయాణికుల భద్రతకు అత్యుధిక ప్రాధాన్యత ఇస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. దీనిపై సంస్థకు చెందిన నిర్వహణ, ఇంజనీరింగ్ బృందం సైతం దర్యాప్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.