అయోధ్య వివాదంపై ఇవాళ సుప్రీంలో విచారణ

రామజన్మభూమి -బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక అందజేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పడ్డ ఈ కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్‌లో ఇచ్చింది. కమిటీ నివేదికపై ధర్మాసనం ఇవాళ విచారణ జరుపుతుంది. ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీని.. జూలై 31వ తేదీన నివేదికలను సమర్పించాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ మధ్యాహ్నం 2.00 గంటలకు […]

అయోధ్య వివాదంపై ఇవాళ సుప్రీంలో విచారణ

Edited By:

Updated on: Aug 02, 2019 | 5:48 AM

రామజన్మభూమి -బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక అందజేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పడ్డ ఈ కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్‌లో ఇచ్చింది. కమిటీ నివేదికపై ధర్మాసనం ఇవాళ విచారణ జరుపుతుంది. ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీని.. జూలై 31వ తేదీన నివేదికలను సమర్పించాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ మధ్యాహ్నం 2.00 గంటలకు విచారణ జరపనుంది. కాగా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా ఛైర్మన్‌గా.. శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసాద్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా మధ్యవర్తిత్వ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.