Viral Video: ఫస్ట్ డే ఆటో రిక్షాను నడుపుతూ ఆఫీస్‌కు విదేశీ దౌత్య అధికారి..!

భారత్‌లో ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్‌గా నియమితులైన నికోలస్ మెక్‌కాఫ్రీ శుక్రవారం నుంచి తన పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు ఆయన ఆటో రిక్షాలో ఆఫీస్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. సదరు ఆటో రిక్షాను స్వయంగా ఆయనే నడుపుతూ..

Viral Video: ఫస్ట్ డే ఆటో రిక్షాను నడుపుతూ ఆఫీస్‌కు విదేశీ దౌత్య అధికారి..!
Australian Deputy High Commissioner To India Nicholas Mccaffrey

Updated on: Dec 30, 2023 | 1:20 PM

భారత్‌లో ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్‌గా నియమితులైన నికోలస్ మెక్‌కాఫ్రీ శుక్రవారం నుంచి తన పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు ఆయన ఆటో రిక్షాలో ఆఫీస్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. సదరు ఆటో రిక్షాను స్వయంగా ఆయనే నడుపుతూ.. తన నివాసం నుంచి ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయన తన అధికారిక ఎక్స్ (పాత పేరు ట్విట్టర్)లో షేర్ చేయడంతో అదికాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌లో ఆస్ట్రేలియా దౌత్య అధికారిగా సేవలు అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ఆస్ట్రేలియన్ హైకమీషనర్ ఫిలిప్ గ్రీన్ నాయకత్వంలో నికోలస్ మెక్‌కాఫ్రీ డిప్యూటీ హైకమిషనర్‌గా పనిచేయనున్నారు.

“నమస్తే ఇండియా! సారా స్టోరీ స్థానంలో ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్‌గా భారత్‌లో విధులు ప్రారంభించడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది. @AusHCIndia ఫిలిప్ గ్రీన్ నాయకత్వంలో భారతదేశంలో #TeamAustraliaతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అంటూ McCaffrey X (గతంలో Twitter)లో పోస్ట్ చేసారు.

ఆస్ట్రేలియా-భారత సంబంధాలు

గత కొన్నేళ్లుగా భారత్ – ఆస్ట్రేలియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మునుపెన్నడూ లేని అత్యున్నత స్థాయికి చేరుకుందని ఇటీవల భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ పేర్కొన్నారు. ఈ మైత్రీ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. అటు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మునుపెన్నడూ లేని స్థాయికి బలోపేతం అయ్యాయి.