నగ్రోటా మిలిటరీ స్టేషన్‌ వద్ద కాల్పులు.. గాయపడ్డ భారత జవాన్!

కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే దుష్ట పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్వయంగా వెల్లడించారు.

నగ్రోటా మిలిటరీ స్టేషన్‌ వద్ద కాల్పులు.. గాయపడ్డ భారత జవాన్!
Nagrota Attack

Updated on: May 11, 2025 | 12:22 AM

కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే దుష్ట పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్వయంగా వెల్లడించారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేసిన్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బాడ్‌మేర్‌లలో పూర్తిగా విద్యుత్‌ నిలిపివేశారు.

రాత్రి 8 గంటల నుండి, జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్, పూంచ్, నౌషెరా, శ్రీనగర్, ఆర్‌ఎస్ పురా, సాంబా, ఉధంపూర్‌లలో పాకిస్తాన్ వైపు కాల్పులు జరుపుతోంది. రాజౌరిలో షెల్లింగ్ (ఫిరంగి, మోర్టార్) జరిగింది. ఉధంపూర్‌లో డ్రోన్ దాడి జరిగింది. కాల్పుల నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్అవుట్ విధించారు.

భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ చేసింది, ఎల్‌వోసీ దగ్గర అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన, నగ్రోటా మిలిటరీ స్టేషన్ అప్రమత్తంది. సరిహద్దు దాటి చొరబాటుకు యత్నిస్తున్న వారిని భారత సెంట్రీ గుర్తించారు. దీని తరువాత, అనుమానితుడితో కొద్దిసేపు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సెంట్రీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, చొరబాటుదారులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు భారత సైన్యం వైట్ నైట్ కార్ప్ ట్వీట్ చేసింది.

ఇదిలావుంటే, ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు పాకిస్తాన్ కాల్పుల్లో 5 మంది సైనికులు అమరులయ్యారు. పాకిస్తాన్ దాడుల్లో 60 మంది సైనికులు కూడా గాయపడ్డారు. అదే సమయంలో, 17 మంది పౌరులు కూడా మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. వీరితో పాటు రాజౌరీ అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ (ఏడీడీసీ) డాక్టర్ రాజ్ కుమార్ థాపా కూడా పాక్ షెల్లింగ్‌లో గాయపడి, చికిత్స పొందుతూ మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..