AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడికి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి యత్నించాడు దుండగుడు. సివిల్ లైన్స్‌లోని ఆమె ప్రభుత్వ నివాసంలో జరిగిన బహిరంగ విచారణ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడికి ప్రయత్నం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడికి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు
Delhi Cm Rekha Gupta
Balaraju Goud
|

Updated on: Aug 20, 2025 | 9:45 AM

Share

ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి యత్నించాడు ఓ దుండగుడు. సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బహిరంగ విచారణ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రాయి లాంటి వస్తువుతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా బృందం, స్థానిక ప్రజలు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పబ్లిక్ హియరింగ్ సమయంలో, ఒక వ్యక్తి తన ఫిర్యాదుతో ముఖ్యమంత్రి వద్దకు వచ్చాడు. కానీ అకస్మాత్తుగా అతను ముఖ్యమంత్రిపై రాయిలాంటి వస్తువుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అసభ్యకరమైన భాషతో దూషిస్తూ.. దాడికి తెగబడ్డాడు. దాడి చేసిన వ్యక్తి వయస్సు దాదాపు 35 సంవత్సరాలు అని, అతని చేతిలో కొన్ని కాగితాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంఘటన తర్వాత సంఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడికి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం రేఖ గుప్తాపై జరిగిన దాడిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. సీఎంపై జరిగిన దాడిని వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం నిజం బయటకు వస్తుందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?