Dharmendra Pradhan: వికసిత్ భారత్‌లో నారీ శక్తి పాత్ర ఎంతో కీలకం- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

భోపాల్‌లో నిర్వహించిన ఆత్మనిర్భర్ మహిళా సమ్మాన్ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంసమృద్ధి సాధించిన మహిళా శక్తులతో ముచ్చటించి, వారు సాధిస్తున్న విజయాలను అభినందించారు. దేశ ప్రగతిలో నారీ శక్తి పాత్ర ఎంతో కీలకమని, ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Dharmendra Pradhan: వికసిత్ భారత్‌లో నారీ శక్తి పాత్ర ఎంతో కీలకం- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
,dharmendra Pradhan On Women Empowerment

Updated on: Jun 14, 2026 | 12:31 PM

భోపాల్‌లో జరిగిన ఆత్మనిర్భర్ మహిళా సమ్మాన్ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొని, స్వయంసమృద్ధి సాధించిన మహిళలతో ముచ్చటించారు. వారు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించిన ఆయన.. మహిళల శ్రమను, ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని అభినందించారు. ప్రస్తుతం దేశంలోని నారీ శక్తి సరికొత్త ఆవిష్కరణలు, స్వయంసమృద్ధితో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలను అన్ని రంగాల్లో సమర్థులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ‘లఖ్‌పతి దీదీల’ గురించి ప్రస్తావిస్తూ.. వారు స్వయం ఉపాధితో పాటు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణల రంగాల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

నైపుణ్యాభివృద్ధి – పర్యావరణ పరిరక్షణ

మహిళలు ఉన్నత విద్య, పీహెచ్‌డీ, ఐటీఐ (ITI) వంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా తమ భవిష్యత్తుకు కొత్త బాటలు వేసుకుంటున్నారని ఆయన చెప్పారు. దేవాలయాల నుంచి వచ్చే వ్యర్థాలను పునర్వినియోగం చేస్తూ సరికొత్త ఉత్పత్తులను తయారు చేయడాన్ని.. పరిశుభ్రతకు, సృజనాత్మకతకు, స్వయంసమృద్ధికి ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ‘గోబర్ధన్ యోజన’ను ప్రస్తావిస్తూ.. వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా మార్చడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణకు, స్వయంసమృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు.

విద్యా రంగంలో కొత్త అవకాశాలు

మహిళలకు విద్య, నైపుణ్య రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇగ్నో (IGNOU)తో కలిసి కొత్త ప్రయత్నాలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనితో పాటు, ఐఐఎం (IIM) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తామని, తద్వారా మహిళలకు మెరుగైన అవకాశాలు, సరికొత్త వసతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాతృశక్తి క్రియాశీల భాగస్వామ్యంతోనే ‘వికసిత భారత్’ కల సాకారమవుతుంది. ఈ శక్తే దేశ ప్రగతికి, సమృద్ధికి ప్రధాన ఆధారం మని ఆయన అన్నారు.

భోపాల్ నగరాన్ని స్వచ్ఛంగా, అందంగా, స్వయంసమృద్ధి నగరంగా తీర్చిదిద్దడంలో నారీ శక్తి పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. అలాగే పీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, మెరుగైన జీవనశైలి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భోపాల్‌లోని ప్రతి ఇల్లూ నారీ శక్తి స్వయంసమృద్ధికి, వారి విజయగాథకు సాక్షిగా నిలవాలన్నదే తమ ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us