నేడు జలావాసానికి అత్తివరదర్ స్వామి

తమిళనాడులోని కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహిస్తున్న అత్తి వరదర్‌ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజైన శుక్రవారం ఉదయం స్వామి వారిని రోజారంగు పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ ఆలయంలో 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజులపాటు అత్తి వరదర్‌ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జులై 1న ప్రారంభమైన ఉత్సవాల్లో 31 రోజులపాటు శయన అవతారంలో..ఆగస్టు ఒకటి నుంచి నిలబడిన అవతారంలో స్వామి […]

నేడు జలావాసానికి అత్తివరదర్ స్వామి

Edited By:

Updated on: Aug 17, 2019 | 9:43 AM

తమిళనాడులోని కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహిస్తున్న అత్తి వరదర్‌ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజైన శుక్రవారం ఉదయం స్వామి వారిని రోజారంగు పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ ఆలయంలో 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజులపాటు అత్తి వరదర్‌ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జులై 1న ప్రారంభమైన ఉత్సవాల్లో 31 రోజులపాటు శయన అవతారంలో..ఆగస్టు ఒకటి నుంచి నిలబడిన అవతారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. వీఐపీ, వీవీఐపీల దర్శనాన్ని గురువారం మధ్యాహ్నంతో ముగించి…శుక్రవారం ఉచిత దర్శనం మాత్రమే కొనసాగించారు. గురువారం రాత్రి వరకు సుమారు కోటి మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని జిల్లా కలెక్టరు తెలిపారు. ఇవాళ ఉదయం వరకు దర్శనానికి అనుమతించి.. సాయంత్రం లేదా రాత్రికి అనంత సరస్సులో జలావాసానికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మళ్లీ వరదరాజస్వామి దర్శనం 40 ఏళ్ల తర్వాత ఉంటుంది.