
కేరళలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బోటు బోల్తాపడింది. దాదాపు 9 మంది వరకు జలసమాధి అయ్యారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. మలప్పురం తన్నూరు బీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లతో సముద్రంలో గాలిస్తున్నారు. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..