కంగనా రనౌత్, శివసేన నేత సంజయ్ రౌత్ మధ్య జరిగిన రగడ తాలూకు ఆడియోను బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఆలకించారు. కంగనాను ఉద్దేశించి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తరఫు లాయర్ కోర్టుకు వినిపించారు. నీకు గుణపాఠం నేర్పాలి అంటూ సంజయ్ చేసిన హెచ్చరికను ఆయన వినిపించారు. అయితే సంజయ్ రౌత్ తరఫు న్యాయవాది ఇందుకు అభ్యంతరం చెబుతూ ఈ ఆడియోలో పిటిషనర్ పేరు లేదని అన్నారు. తాము మంగళవారం అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అటు-కంగనా ఆఫీసును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేత విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాగా-ఓ ఆడియోను బాంబే హైకోర్టు ఆలకించడం ఇదే మొదటిసారి.