Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలీంగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించిన ఎన్నికల అధికారులు

ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్​, త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ఎలక్షన్​ కమిషన్ ప్రకటించింది ​. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలీంగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించిన ఎన్నికల అధికారులు
Assembly Elections 2023

Updated on: Jan 18, 2023 | 3:30 PM

ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్​, త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ఎలక్షన్​ కమిషన్ ప్రకటించింది ​. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. మేఘాలయా, నాగాలండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. మార్చి 2న మూడు రాష్ట్రాల ఫలితాల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.

త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..

  • త్రిపురలో ఫిభ్రవరి 16న పోలింగ్‌
  • నాగాలాండ్‌ ,మేఘాలయాలో ఫిభ్రవరి 27న పోలింగ్‌
  • మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్‌

9వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు..

ఈ మూడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మహిళా ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మేము జనవరి 11 నుండి 14 వరకు మూడు రాష్ట్రాల పర్యటనలో ఉన్నామని అన్నారు. ఇందులో 17 ఏళ్లు నిండి 18 ఏళ్లు నిండని వారికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు కార్డు పొంది వారి పేర్లను చేర్చేలా ముందస్తు సమాచారం అందించే ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 10వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని.. మూడు రాష్ట్రాల్లో 9వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. వీటిలో 376 పూర్తిగా మహిళలే నిర్వహించనున్నారని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం