ASSASSINATION: రాజీనామా చేయకుంటే చంపేస్తామంటూ ఆ ముఖ్యమంత్రికి బెదిరింపు.. 3 నెలలు డెడ్ లైన్..

|

Mar 14, 2022 | 7:24 AM

ASSASSINATION: మూడు నెలల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తానంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి బెదిరింపులు వచ్చాయి. ఇందుకోసం ప్రత్యేకంగా షూటర్ ను నియమించినట్లు నిందితుడు తెలిపాడు.

ASSASSINATION: రాజీనామా చేయకుంటే చంపేస్తామంటూ ఆ ముఖ్యమంత్రికి బెదిరింపు.. 3 నెలలు డెడ్ లైన్..
Death Threat
Follow us on

ASSASSINATION: మూడు నెలల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తానంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. మిజోరం సీఎం జొరాంథంగాపై(Mizoram CM Zoramthanga) ఓ దుండగుడు బెదింపులకు పాల్పడ్డాడు. ఇందుకోసం తాను ప్రత్యేకంగా ఒక షూటర్​ను కూడా ఏర్పాటు చేసినట్లు అతడు వెల్లడించాడు. సోషల్​ మీడియా ద్వారా నిందితుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

మిజోరం సీఎంపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఖాజ్వల్​ ప్రాంతానికి చెందిన రోడిన్​లియానా అలియాస్​ అపుయా టోచ్ఛాంగ్​గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఐజ్వాల్​లోని ఛాన్మరీ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిందితుడు.. ‘తింగ్​ట్లాంగ్​ పా’ అనే నకిలీ అకౌంట్​ను వినియోగించి బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు ఈ బెదిరింపులను ఇతర ఫేస్​బుక్​ గ్రూపుల్లో షేర్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్​ను ముఖ్యమంత్రి తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ నిందితుడు దుష్ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సీఎంను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగటం ఇది తొలిసారి కాదని తెలుస్తోంది. 2018లో కూడా అప్పటి సీఎం లాల్​ తన్హావాలాకు సైతం అప్పట్లో నిందితుడు బెదిరింపు లేఖ రాశాడని తెలుస్తోంది. అప్పట్లో కూడా ఇలాగే ముఖ్యమంత్రిని చంపేస్తానంటూ బెదిరింపులు చేయటంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి..

Ukraine Russia War: ఉక్రెయిన్ శరణార్థులకు బ్రిటన్ చేయూత.. అలా చేసిన వారికి నెలకు 450 డాలర్లు..

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..