బుల్లెట్‌ ట్రైన్‌కు ధీటుగా భారత్‌లో హైపర్‌లూప్‌

|

Mar 15, 2025 | 9:39 PM

బుల్లెట్‌ ట్రైన్‌కు ధీటుగా భారత్‌లో హైపర్‌లూప్‌ ట్రైన్‌ రాబోతుంది. చెన్నై ఐఐటీ టేకప్‌ చేసిన ఈ ప్రాజెక్ట్‌.. రవాణా వ్యవస్థలో పెను విప్లవం కానుంది. హై స్పీడ్‌ టెస్ట్‌ ట్రాక్‌ ను పరిశీలించిన కేంద్రమంత్రి అశ్వినీ దత్‌..పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు. స్పీడ్‌తో పాటు సేఫ్టీపై దృష్టిసారించాలని సూచించారు.

బుల్లెట్‌ ట్రైన్‌కు ధీటుగా భారత్‌లో హైపర్‌లూప్‌
Hyperloop Project
Follow us on

భారతీయ రైల్వే సహకారంతో చెన్నై ఐఐటీ టీమ్‌ 422 మీటర్ల హై స్పీడ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సిద్ధం చేసింది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హైపర్‌ లూప్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించి పురోగతిపై సమీక్షించారు. హైపర్‌ లూప్‌ ట్రాక్‌ ప్రాజెక్ట్‌లో పురోగతిపై హర్షం వ్యక్తం చేశారాయన. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంతో కృషి చేస్తున్న చెన్నై ఐఐటీ టీమ్‌ను అభినందించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు రెండు విడతలుగా కేంద్రం దాదాపు 18 కోట్లు మంజూరు చేసింది. మూడో విడతగా మరో 8 కోట్ల నిధులను ప్రకటించారు. చైన్నై ఐఐటీ ప్రొఫెసర్లు..స్టూడెంట్స్‌తో ఇంటారాక్టయ్యారు అశ్వీనీ వైష్ణవ్‌. వేగంతో పాటు భద్రతకు ప్రాధన్యాతను ఇస్తూ ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ చేయాలని సూచించారు .

హైపర్‌లూప్‌ అంటే వేగంగా ప్రయాణించేందుకు తయారుచేసే హైస్పీడ్‌ ట్రాక్‌ , ప్రత్యేకంగా విద్యుదయస్కాంత ట్రాక్‌ను తయారుచేస్తారు .ఒక ప్రత్యేకమైన ట్యూబ్‌లో ఈ ట్రాక్‌ ఉంటుంది. ఈ హైపర్‌లూప్‌లో రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. మరింత అభివృద్ధి చేస్తే ఈ హైపర్‌లూప్‌ గంటకు 12వందల కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. ఒక ట్యూబ్‌లో వ్యాక్యూమ్‌ సృష్టించడం ద్వారా ఇది పరుగులుదీస్తుంది. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..