మందిర నిర్మాణంతోనే కరోనా అంతం.. బీజేపీ ఎంపీ

యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. దీనికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. అయితే ఈ వైరస్.. రామ మందిర నిర్మాణంతోనే అతమవుతుందని..

మందిర నిర్మాణంతోనే కరోనా అంతం.. బీజేపీ ఎంపీ

Edited By:

Updated on: Jul 29, 2020 | 5:34 PM

యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. దీనికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. అయితే ఈ వైరస్.. రామ మందిర నిర్మాణంతోనే అతమవుతుందని బీజేపీ ఎంపీ జస్కౌర్‌ మీనా తెలిపారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన వెంటనే ఈ వైరస్ నాశనమవుతుందన్నారు. ఓ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జస్కౌర్‌ మీనా రాజస్థాన్‌ రాష్ట్రంలోని దౌసా పార్లమెంట్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రోటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆగస్టు 5వ తేదీన రామజన్మ భూమిలో భూమి పూజ నిర్వహించి.. మందిర నిర్మాణ పనులు ప్రారంభించగానే.. కరోనా మహమ్మారి అంతం ప్రారంభమవుతుందని వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలోని రామజన్మ భూమిలో భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వందల మంది హాజరుకానున్నారు.