Aryan Khan: ఆర్యన్‌ బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

|

Oct 27, 2021 | 5:50 PM

Aryan Khan: డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌కు బెయిల్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై..

Aryan Khan: ఆర్యన్‌ బెయిల్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
Follow us on

Aryan Khan: డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌కు బెయిల్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. బాంబే హైకోర్టులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు కూడా వాడివేడిగా వాదనలు జరిగాయి. రేపు ఎన్సీబీ తరపున కోర్టులో వాదనలు విన్పిస్తారు.

అయితే ఆర్యన్‌తో పాటు అరెస్టయిన అతడి ఫ్రెండ్‌ ఆర్భాజ్‌ తరపున వాదనలు విన్పించారు ప్రముఖ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌. ఆర్యన్‌, ఆర్భాజ్‌లను చట్ట విరుద్దంగా అరెస్ట్‌ చేశారని అన్నారు. ఆర్బాజ్‌పై కేవలం డ్రగ్స్‌ సేవించినట్టు అభియోగాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరికి సెషన్స్‌ కోర్టు బెయిల్ ఇచ్చిందని, ఆర్యన్‌, అర్భాజ్‌కు కూడా బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును అభ్యర్ధించారు.

ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు..

ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆర్యన్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసిందని వాదనలు వినిపించారు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ. క్రూయిజ్‌లో పార్టీకి గెస్ట్‌గా మాత్రమే ఆర్యన్‌ వెళ్లాడని, ప్రతీక్‌ గబ్బా ఆహ్వానం మేరకే క్రూయిజ్‌ పార్టీకి ఆర్యన్‌ వెళ్లినట్టు కోర్టుకు తెలిపారు. ఆర్యన్‌ ఫ్రెండ్‌ ఆర్భాజ్‌ దగ్గర షూస్‌లో ఆరుగ్రాముల చరస్‌ దొరికిందన్నారు. ఆర్యన్‌ను అరెస్ట్‌ చేసి 23 రోజులైనా.. ఇప్పటికి కూడా ఎన్సీబీ ఆయన దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేకపోయిందన్నారు. అసలు సాక్ష్యాలే లేనప్పుడు, వాటిని తారుమారు ఎలా చేస్తారని ప్రశ్నించారు ముకుల్‌ రోహత్గీ.

 ఆర్యన్‌కు నేరచరిత్ర లేదు..

గతంలో ఆర్యన్‌కు నేరచరిత్ర లేదని, క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీపై ఎన్సీబీకి ముందే సమాచారముందని అన్నారు. కుట్రలో భాగంగానే అరెస్ట్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. మెడికల్‌ టెస్ట్‌లో ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారణ కాలేదని, అసలు పార్టీ జరగలేదని, పార్టీకి ముందే అరెస్ట్‌ చేశారని కోర్టుకు తెలిపారు. ఆర్యన్‌ ఫోన్‌లో లభ్యమైన డ్రగ్స్‌ చాట్స్‌ ఆయన విదేశాల్లో ఉన్న సమయం లోనివని, ఈ కేసుతో సంబంధం లేదని వాదించారు ముకుల్‌.

ఇవి కూడా చదవండి:Pegasus Spyware Case: పెగాసస్ స్పైవేర్ కేసు దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీ.. సుప్రీం కోర్టు కీలక తీర్పు!

AP Crime News: డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. డ్రైవర్ దుర్మరణం..