సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. కవ్వింపు చర్యలకు దిగిన పాక్

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని సుందర్బానీ సెక్టార్‌లో మోటార్ షెల్స్‌తో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 34 ఏళ్ల భారత జవాను నాయక్‌ క్రిషన్‌లాల్‌ ప్రాణాలు కోల్పోయాడు. తంగ్‌ధర్‌ – కేరాన్‌ సెక్టార్‌లో కూడా కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇస్తోంది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:53 pm, Tue, 30 July 19