ఆర్టికల్‌ 370 రద్దు: మాజీ సీఎంలు అరెస్ట్‌!

|

Aug 05, 2019 | 9:18 PM

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనగర్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్న ముఫ్తీని అరెస్ట్‌ చేసి ప్రభుత్వ అతిథి గృహానికి తరలించినట్లు సమాచారం. అబ్దుల్లాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లులకు రాజ్యసభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఇప్పటికే ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ ముఫ్తీ పలు […]

ఆర్టికల్‌ 370 రద్దు: మాజీ సీఎంలు అరెస్ట్‌!
Follow us on

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనగర్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్న ముఫ్తీని అరెస్ట్‌ చేసి ప్రభుత్వ అతిథి గృహానికి తరలించినట్లు సమాచారం. అబ్దుల్లాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లులకు రాజ్యసభ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఇప్పటికే ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ ముఫ్తీ పలు ట్వీట్లు చేశారు. ఒమర్‌ అబ్దుల్లా సైతం దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నేతలను శనివారం అర్ధరాత్రి గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే.