Jammu and Kashmir: రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం..

|

Oct 11, 2022 | 12:18 PM

ఉగ్రవాదులను గుర్తించే పనిని ఆర్మీ జాగిలానికి అప్పగించారు. ఆ ఆర్మీ డాగ్‌ పేరు జూమ్‌. దానికి కఠిన శిక్షణను ఇచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా జూమ్

Jammu and Kashmir: రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం..
Brave Assault Dog
Follow us on

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూమ్ అనే భారత ఆర్మీ డాగ్‌ తీవ్రంగా గాయపడిందని ఆయా సంస్థ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. జూమ్‌ను శ్రీనగర్‌లోని ఆర్మీ వెట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కుక్క ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కానీ, తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా ఆ ఆర్మీ డాగ్‌ పోరాటం కొనసాగించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారంటూ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ డాగ్ తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు దక్షిణ కాశ్మీర్‌లోని ఈ జిల్లాలోని టాంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

ఉగ్రవాదులను గుర్తించే పనిని ఆర్మీ జాగిలానికి అప్పగించారు. ఆ ఆర్మీ డాగ్‌ పేరు జూమ్‌. దానికి కఠిన శిక్షణను ఇచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా జూమ్ అనేక క్రియాశీల కార్యక్రమాల్లో భాగమైందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు జరిపిన రెండు షాట్‌ల కారణంగా జూమ్‌కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దానిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడింది.. రెండు తుపాకీ గుండ్లు జూమ్‌ శరీంలోకి దూసుకెళ్లాయి. అయినా, దాని పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే ఘటనా స్థలానికి చేరుకున్న దళాలు ఉగ్రవాదులను మట్టుపెట్టాయని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత జూమ్‌ను ఆర్మీకి చెందిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు సైనికులు కూడా గాయపడినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జూమ్ అనే భారత ఆర్మీ దాడి కుక్క తీవ్రంగా గాయపడిందని చినార్ కార్ప్స్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. జూమ్‌ను శ్రీనగర్‌లోని ఆర్మీ వెట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కుక్క ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

“ఆప్ టాంగ్పావా, #అనంతనాగ్. ఉగ్రవాదులతో తలపడుతున్న ఆర్మీ దాడి కుక్క ‘జూమ్’ ఆపరేషన్ సమయంలో తీవ్రంగా గాయపడింది. అతను ఆర్మీ వెట్ హాస్ప్ #శ్రీనగర్‌లో చికిత్స పొందుతున్నాడు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అని పోస్ట్‌లో ఉంది.

సైన్యం జూమ్, అతని ధైర్యసాహసాల వీడియోను కూడా పోస్ట్ చేసింది. “ఆర్మీ దాడి కుక్క ‘జూమ్’ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము.”

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..