దేశంలోని విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు ఉద్యోగాల కల్పనను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో 50 అదనపు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గురువారం (అక్టోబర్ 24) ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని చెప్పారు. రానున్న 20 ఏళ్లలో ఈ సంఖ్య 200 అదనపు విమానాశ్రయాలకు పెరుగుతుందని అంచనా వేశారు.
రాబోయే కాలంలో 50 అదనపు విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాశ్రయ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, ఈ నిర్ణయం ఉపాధి కల్పనను కూడా పెంచుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగి 157కు చేరుకుందన్నారు, రానున్న 20 ఏళ్లలో మరో 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఎయిర్‌బస్ ఇండియా మరియు సౌత్ ఏషియా హెడ్‌క్వార్టర్స్, ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయ పర్యావరణ వ్యవస్థను విస్తరించడం ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు. ఇది ఉద్యోగ అవకాశాలు, వాణిజ్య వృద్ధి రెండింటినీ ప్రేరేపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Today, I had the privilege of inaugurating Airbus' first fully owned headquarters and training center in Asia near New Delhi International Airport. This state-of-the-art facility will train up to 800 pilots and 200 technicians each year.
I commend @Airbus for its significant… pic.twitter.com/6WOhkEKo56— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) October 24, 2024
సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వుమ్లున్‌మాంగ్ వుల్నామ్ కూడా విమాన ప్రయాణంలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యిందన్నారు. గత ఏడాది నమోదైన ప్రస్తుత 220 మిలియన్ల నుండి వచ్చే ఐదేళ్లలో ప్రయాణీకుల రద్దీ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (RCS) – UDAN, 2016లో ప్రారంభించడం జరిగింది. దాని 8వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసింది. ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అసంగ్బా చుబా ఏవో ఆదివారం ఈ పథకం అద్భుతమైన విజయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 601 రూట్‌లు ఇప్పుడు పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు దాదాపు 1.44 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని ఆయన తెలిపారు.
ఇక UDAN ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఇప్పటికి దాదాపు 1.44 కోట్ల మంది ప్రజలు RCS కింద ప్రయాణించారు. ఇది ఏ కొలతతో చూసినా భారీ సంఖ్య. ఈ పథకం కింద ఇప్పటివరకు 601 రూట్‌లలో నడిపారని జాయింట్ సెక్రటరీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..