Copying: పరీక్షలో కాపీ కొడుతూ అడ్డంగా బుక్కైన విద్యార్థి.. కసితీరా కొరికిన లెక్చరర్.. ఎక్కడంటే..

|

Apr 02, 2022 | 6:17 AM

Professor bites cheating student: పరీక్షల్లో కాపీ కొడుతున్న ఘటనలను మనం చాలానే చూసి ఉంటాం.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను గుర్తించిన సందర్భంలో.. అధికారులు వారిని డిబార్ చేస్తుంటారు.

Copying: పరీక్షలో కాపీ కొడుతూ అడ్డంగా బుక్కైన విద్యార్థి.. కసితీరా కొరికిన లెక్చరర్.. ఎక్కడంటే..
Exam
Follow us on

Professor bites cheating student: పరీక్షల్లో కాపీ కొడుతున్న ఘటనలను మనం చాలానే చూసి ఉంటాం.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను గుర్తించిన సందర్భంలో.. అధికారులు వారిని డిబార్ చేస్తుంటారు. అయితే.. ఇక్కడ విస్మయం కలిగించే ఘటన చోటుచేసుకుంది. కాపీ కొడుతున్న విద్యార్థిని గుర్తించిన అధ్యాపకుడు.. విద్యార్థి చేతిని దారుణంగా కొరికాడు. దీంతో విద్యార్థి చేతికి తీవ్ర రక్త స్రావమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga) జిల్లా హొసనగరలోని డిగ్రీ కళాశాలలో జరిగింది. హోసనగర్‌లోని కొడచాద్రి ప్రభుత్వ కళాశాలలో మంగళవారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో కొన్ని రోజులుగా డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షలో కాపీయింగ్‌కు పాల్పడుతుండటాన్ని లెక్చరర్ చూశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలో ఆగ్రహానికి గురైన అధ్యాపకుడు విద్యార్థి చేతిని పట్టుకొని కొరికాడు. ఈ ఘటనను కొందరు విద్యార్థులు వైరల్‌ చేయడంతో శుక్రవారం ఈ విషయం బయటకు వచ్చింది.

కాగా.. విద్యార్థి బీఏ చివరి సంవత్సరం చదువుతున్న కీర్తేష్‌గా గుర్తించారు. పరీక్షలో మొబైల్ ఫోన్ ఉపయోగించి కాపీయింగ్ చేస్తూ దొరికిపోయినట్లు తెలుస్తోంది. గదికి ఎగ్జామినర్‌గా నియమించిన ప్రొఫెసర్ అంజన్‌కుమార్‌కు విద్యార్థి కాపీయింగ్‌ను గుర్తించారని.. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమచారం. ఈ ఘటన అనంతరం విద్యార్థి ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై లెక్చరర్ కూడా ఫిర్యాదు చేశారు.

Also Read:

Watch Video: షారుక్ ఔటవ్వగానే చిందులేసిన సుహానా ఖాన్, అనన్య పాండే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Viral Video: లవర్స్ మధ్య ఫైట్.. మధ్యలో ఎంటరయిన డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత షాకింగ్ సీన్