మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక్లలో ఎన్డీఏ కూటమి దుమ్మరేపుతోంది. మహాయుతి కూటమి 215 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ కూటమి కేవలం 55 చోట్ల ముందంజలో ఉండగా.. ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వస్తున్నాయి. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన చాలా సంస్థలు మహాయుతి విజయాన్నే అంచనా వేశాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఏకపక్ష విజయం వస్తుందని అంచనా వేసి.. సీట్ల సంఖ్యతో సహా పూర్తి కచ్చితత్వంతో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన కేకే సర్వే.. ఇటు మహారాష్ట్రకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 225 స్థానాలను గెలుస్తుందని కేకే సర్వే తెలిపింది. మహా వికాస్ అఘాడీ కూటమికి 56 సీట్లు.. ఇతరులకు 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాకు తగ్గట్లుగానే మహారాష్ట్ర ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహాయుతి కుటమి 219 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. మహా వికాస్ అఘాడీ 56 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కానీ ఇతరులు మాత్రం 15 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. ఫలితాలకు చాలా క్లోజ్‌గా కేకే సర్వే అంచనాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది.
KK Exit poll survey about MH finally results.😊pic.twitter.com/ndhYI3yEMW pic.twitter.com/fV6vq5rzng
— MRN4R35H (@MRN4R35H) November 23, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..