Ancient Temple: పురాతన శివాలయంలో అద్భుతం.. కుంభాభిషేకం కోసం తవ్వకాలు జరుపగా బయటపడ్డ..

|

Apr 16, 2023 | 10:25 PM

తమిళనాడులోని ఓ పురాతన శివాలయంలో భారీగా బయటపడ్డ పంచలోహ విగ్రహాలు సంచలనంగా మారాయి. ఒకటీ రెండు కాదు. ఏకంగా 22 విగ్రహాలు ఆలయంలోని తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు.. మైలాడుదురై జిల్లాలోని శీర్గాళిలో చటగట్నాథన్‌ దేవాలయంలో మూడు దశాబ్దాల తర్వాత కుంభాభిషేకానికి..

Ancient Temple: పురాతన శివాలయంలో అద్భుతం.. కుంభాభిషేకం కోసం తవ్వకాలు జరుపగా బయటపడ్డ..
Lord Shiva Temple
Follow us on

తమిళనాడులోని ఓ పురాతన శివాలయంలో భారీగా బయటపడ్డ పంచలోహ విగ్రహాలు సంచలనంగా మారాయి. ఒకటీ రెండు కాదు. ఏకంగా 22 విగ్రహాలు ఆలయంలోని తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు.. మైలాడుదురై జిల్లాలోని శీర్గాళిలో చటగట్నాథన్‌ దేవాలయంలో మూడు దశాబ్దాల తర్వాత కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు.

అందులో భాగంగానే యాగశాలకోసం దేవాలయంలోని ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. యాగశాల ఏర్పాట్లలో భాగంగా ఆలయంలోపల తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో ఏకంగా 22 దేవతా మూర్తుల విగ్రహాలు బయటపడ్డంతో అంతా ఆశ్చర్యపోయారు.

30 ఏళ్ళ తరువాత తలపెట్టిన కుంభాభిషేకానికి ఆలయంలో మరమ్మతుల కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలన్నీ పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలే కావడం విశేషం. అంతేకాదు… విగ్రహాలన్నీ రెండడుగుల ఎత్తులోనే ఉన్నాయి. వీటికి తోడు వందలకొద్దీ రాగిరేకులు, ఇతర పూజాసామాగ్రి తవ్వకాల్లో బయటపడ్డాయి. పురాతన శివాలయంలో బయటపడ్డ ఈ విగ్రహాల సమాచారాన్ని పురావస్తు శాఖకు ఇచ్చారు ఆలయ అధికారులు. చరిత్రను తడిమి చూసిన ప్రతిసారీ సరికొత్త చరిత్ర బయటపడుతూనే ఉంటుంది. ఈ పురాతన శివాలయంలో బయపటడ్డ విగ్రహాలు ఏ చరితను వినిపిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..