Anand Mahindra: ఇజ్రాయిల్ తరహా ‘ఐరన్ డోమ్’ను నిర్మించుకోవాలి.. కేంద్ర సర్కార్‌కు ఆనంద్ మహీంద్రా ట్వీట్

ఆనంద్ మహీంద్రా..భారతప్రభుత్వానికి ఓ సూచన చేశారు. భవిష్యత్తులో జరిగే డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి ప్రత్యేక డ్రోన్లను కొనుగోలు చేయడం కోసం రక్షణ బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Anand Mahindra: ఇజ్రాయిల్ తరహా ఐరన్ డోమ్ను నిర్మించుకోవాలి.. కేంద్ర సర్కార్‌కు ఆనంద్ మహీంద్రా ట్వీట్
Anand Mahindra Israeli Type

Updated on: Jun 30, 2021 | 4:44 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్  ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. వివిధ సమకాలిన అంశాలపై స్పందిస్తూ ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. అందులో కొన్ని విషయాలు నవ్వించేవి ఉంటే, మరికొన్ని ఆలోచింపజేసేవి ఉంటాయి. తాజాగా, ఆయన భారతప్రభుత్వానికి ఓ సూచన చేశారు. భవిష్యత్తులో జరిగే డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి ప్రత్యేక డ్రోన్లను కొనుగోలు చేయడం కోసం రక్షణ బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా యుద్ధ సామర్ధ్యాలను పెంచుకోవాలని తన ట్విట్టర్‌లో కోరారు.  ప్రత్యేక డ్రోన్ల కొనుగోలు కోసం రక్షణ బడ్జెట్ లో గణనీయంగా అధిక మొత్తంలో కేటాయింపులు పెంచాలి.. అని ఆయన అన్నారు. డ్రోన్ దాడుల నుంచి రక్షించుకోవడానికి ఇజ్రాయిల్ తరహా ‘ఐరన్ డోమ్’ వంటి టెక్నాలజీ మీద మనం పనిచేయాలని ఆనంద్ మహీంద్రా ట్విటర్ లో పోస్ట్ చేశారు.

జూన్ 27 ఉదయం జమ్మూలోని భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) కీలక రక్షణ స్థావరాలపై డ్రోన్ల వల్ల రెండు పేలుళ్ళు జరిగాయి. జమ్మూ విమానాశ్రయంలోని ఐఏఎఫ్‌ స్టేషన్‌పై శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండ బాంబులను వేరు వేరు చోట్ల జారవిడిచారు. ప్రాణ, ఆస్తి నష్టం జరనప్పటికీ.. ఇంత పెద్ద రక్షణ వ్యవస్థ ఉన్నమన వైమానిక స్థావరాలపైకి డ్రోన్లు రావడం.. దాడి చేయడం ఆందోళనకు గురి చేసింది.

ఇవి కూడా చదవండి : Revanth Reddy: నేను సోనియాగాంధీ మనిషిని.. కాంగ్రెస్ బిడ్డను..ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు..

High alert: ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో హై అలర్ట్.. నిఘా పెంచిన ప్రత్యేక పోలీస్ బలగాలు