Harassment: ఇప్పటికే పది మంది పిల్లలు.. ఆ ఆపరేషన్ చేయించుకుందని భార్యను వెలేసిన భర్త..

|

Feb 19, 2023 | 9:56 AM

శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా అమానవీయ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. భార్యపై హక్కంతా తమదేనని, తాము ఏం చెబితే అదే చేయాలనే భర్తల ఆలోచన మహిళల...

Harassment: ఇప్పటికే పది మంది పిల్లలు.. ఆ ఆపరేషన్ చేయించుకుందని భార్యను వెలేసిన భర్త..
Woman Harassment
Follow us on

శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా అమానవీయ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. భార్యపై హక్కంతా తమదేనని, తాము ఏం చెబితే అదే చేయాలనే భర్తల ఆలోచన మహిళల పాలిట శాపంగా మారుతోంది. తాము ఏ తప్పూ చేయకున్నా నిందను మోయాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా పిల్లలను కనే విషయంలో వేధింపులు, ఆదేశాలు, దాడులు ఎక్కువవుతున్నాయి. నేటి ఆధునిక సమాజంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం ఆవేదన కలిగిస్తోంది. తాజాగా.. ఒడిశాలో జరిగిన ఓ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఆ దంపతులకు ఇప్పటికే పదిమంది సంతానం. మరోసారి గర్భం దాల్చడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రసవం సమయంలో బిడ్డ చనిపోయింది. స్థానిక ఆరోగ్య కార్యకర్తల సహాయంతో ఆమె కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఆగ్రహించిన భర్త.. ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు.

ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా టెల్కోయి సమితికి చెందిన డిమిరియా గ్రామానికి చెందిన రవి దెహురి, జానకి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి పది మంది పిల్లలు సంతానం. కొన్ని నెలల క్రితం ఆమె మరోసారి దర్భం దాల్చింది. నెలలు నిండటంతో కాన్పు అయింది. ప్రసవం సమయంలో శిశువు చనిపోయింది. అప్పటికే పది మది పిల్లలు, శిశువు చనిపోవడం ఇలా.. తరచుగా జరుగుతుండటంతో జానకి అనారోగ్యానికి గురైంది. విషయం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్తలు.. ఆరోగ్యంపై అవగాహన కలిగించారు. వారి చొరవతో ఇటీవల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించునేందుకు నిర్ణయించుకుంది. ఇందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు. భార్యను ఇంట్లోకి రానీయకుండా వేధించాడు. అతని వేధింపులు తాళలేక.. జానకి కుటుంబనియంత్రణ సర్జరీ చేయించుకుంది.

అక అప్పటినుంచి ఆమెకు వేధింపులు మరింత అధికమయ్యాయి. పితృ దేవతలకు పూజలు చేయడానికి అనర్హురాలివయ్యావంటూ ఫైర్ అయ్యాడు. బయటకు గెంటేశాడు. లోపలకు వస్తే చంపేస్తానంటూ ఇంటి ముందు మారణాయుధాలతో కాపలా కాస్తున్నాడు. దీంతో తల్లీ పిల్లలకు ఆశా కార్యకర్తలే ఆహారం అందిస్తు్న్నారు. ఆరోగ్య అధికారులు వచ్చి రవికి నచ్చజెప్పినప్పటికీ విఫలమైంది. తల్లీ పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించారు. రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి