Viral: రైతు కలలో కనిపించి ఓ చోట వెతకమన్న శనిదేవుడు.. అతను ఆ పని చేయగా అద్భుతం

కొన్ని సంఘటనలు నిజంగానే మనల్ని ఆశ్చరానికి గురిచేస్తాయి. అసలు ఇది ఎలా పాజిబుల్ అనిపిస్తుంది. తాజాగా అటువంటి ఓ ఆసక్తికర వార్తను మీ ముందుకు తీసుకొచ్చాం.

Viral: రైతు కలలో కనిపించి ఓ చోట వెతకమన్న శనిదేవుడు.. అతను ఆ పని చేయగా అద్భుతం
Lord Shani (representative image)

Updated on: Aug 17, 2022 | 12:47 PM

Trending: కొన్ని ఘటనల గురించి తెలిసినప్పుడు భలే వింతగా అనిపిస్తాయ్. అసలు ఇలా సాధ్యమేనా అనిపిస్తుంది. మనిషికి కలలు రావడం కామన్. అందులో కొన్ని మంచి కలలు ఉంటే ఇంకొన్ని చెడు కలలు ఉంటాయ్. తెల్లవారుజూమున వచ్చే కలలు నిజం అవుతాయ్ అని కొందరు అంటారు కానీ.. అందుకు తగ్గ శాస్త్రీయ ఆధారాలు అయితే ఏమి లేవు. కానీ ఓ వ్యక్తి కల నిజమైంది. మహారాష్ట్ర(maharashtra)లో ఈ ఘటన వెలుగుచూసింది. శ్రీరాంపూర్ తాలూకాలోని తక్లిభాన్‌లోని రాజ్‌వాడ ప్రాంతంలో పాత కోట ఉంది. ఆ కోట సమీప ప్రాంతంలో నివశించే  రైతు శివాజీరావు ధుమాల్‌కు ఓ రోజు రాత్రి కలలో శనిదేవుడు కనిపించాడు. ఆ కోట సమీపంలో తన విగ్రహం ఉందని.. దాన్ని వెలికి తీయాల్సిందిగా కోరాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు శివాజీరావు. గ్రామంలోని విఠల్ ఆలయ పూజారి రాజేంద్ర దేవల్కర్‌తో సహా అందరూ ఆ స్థలంలో విగ్రహం కోసం వెతకడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికే అక్కడ విగ్రహం ఉందని గుర్తించారు. సాక్షాత్తూ శనిదేవుడు అక్కడ వెలిశాడని అంటున్నారు భక్తులు.  ఈ విగ్రహాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చి.. పూజలు చేస్తున్నారు. ఆ శిల నుదిటిపై చంద్రవంక ఆకారం చెక్కబడి ఉంది. త్వరలో అక్కడ గుడి కడతామని గ్రామస్థులు చెబుతున్నారు. (Soure)

మరిన్ని జాతీయ వార్తలు చదవండి