Hindi Controversy: దేశం ఏకం కాదు.. విడిపోతుంది.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై తమిళనాడు పార్టీల ఆగ్రహం

|

Apr 09, 2022 | 7:57 AM

వివిధ రాష్ట్రాల ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీషు కాకుండా హిందీని ఉపయోగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మరుసటి రోజు.. దక్షిణాది రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.

Hindi Controversy: దేశం ఏకం కాదు.. విడిపోతుంది.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై తమిళనాడు పార్టీల ఆగ్రహం
Kanimozhi Amit Shah
Follow us on

Hindi language Controversy: వివిధ రాష్ట్రాల ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీషు(English) కాకుండా హిందీ(Hindi)ని ఉపయోగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చెప్పిన మరుసటి రోజు.. ద్రవిడ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం తమ వ్యక్తిగత ఎజెండాను బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్డీయే మిత్రపక్షం పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ తప్పుబట్టారు. ఒకే భాష అనే ఆలోచనను తీసుకురావడం వల్ల దేశాన్ని ఏకం చేయడం కాదు.. విభజన జరగుతుందని’ ధ్వజమెత్తారు.

గురువారం జరిగిన పార్లమెంట్ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో షా మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపే మాధ్యమమే అధికార భాషగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, దీని వల్ల హిందీకి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. దేశ సమైక్యతలో అధికార భాషను ముఖ్యమైన భాగంగా చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఇతర భాషలు మాట్లాడే రాష్ట్రాల పౌరులు ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు అది భారత భాషలోనే ఉండాలి” అని షా చెప్పినట్లు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అమిత్ షా ప్రకటనపై తూత్తుకుడి లోక్‌సభ ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ‘ఒకే భాష అనే ఆలోచనను తీసుకురావడం వల్ల దేశాన్ని ఏకం చేయడం కాదు, ప్రాంతీయ విబేధాలు తలెత్తుతాయని అన్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమాల చరిత్ర, దాని కోసం చేసిన త్యాగాల గురించి కేంద్ర ప్రభుత్వం, మంత్రులు తెలుసుకోవాలి’’ అని ఆమె అన్నారు.

అమిత్ షా ప్రకటన దిగ్భ్రాంతి కలిగించిందని పీఎంకే నేత రాందాస్ అన్నారు. దీని అర్థం హిందీ ఇంపోజిషన్ తప్ప మరొకటి కాదుని రాందాస్ అభిప్రాయపడ్డారు. “హిందీ మెజారిటీ రాష్ట్రాల భాష అయినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ హిందీ మాట్లాడే రాష్ట్రాల డిమాండ్లను అంగీకరించారు.ఆంగ్లాన్ని సంప్రదింపు భాషగా కొనసాగించడానికి అనుమతించారు.” అని రాందాస్ స్పష్టం చేశారు. ఒక భారతీయ భాష దేశంలో అధికారిక భాషగా ఉండాలంటే, తమిళం పురాతన భాష, కాబట్టి ఆ స్థానానికి తమిళం అర్హులు అని ఆయన అన్నారు. “అయితే, తమిళులు ఒకే భాషను విధించడాన్ని విశ్వసించరు. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో జాబితా చేసిన అన్ని భాషలను అధికారిక భాషలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి” అని రామదాస్ అన్నారు. “ఇంగ్లీషు సంప్రదింపు భాషగా ఉండాలి, తమిళంతో సహా 22 భాషలను అధికారిక భాషగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు, వారి భావాలను గౌరవించాలి” అని ఆయన అన్నారు.

Read Also….  Horoscope Today: ఈ రాశివారు గొడవలకు దూరంగా ఉంటే మంచిది.. శనివారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా.?

AP Power Cuts: ఓ వైపు ఎండలు.. మరోవైపు కరెంట్ కోతలు.. ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌హాలిడేకి రీజనేంటి?