Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. ఇక నుంచి పెళ్లైన కూతురు కూడా అర్హురాలే..

|

Jan 15, 2021 | 10:23 PM

Allahabad High Court: ప్రతి కుటుంబంలో సాధారణంగా తండ్రి తరువాత అన్నింటికి అర్హుడుగా ఆయన కొడుకునే భావిస్తారు.

Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. ఇక నుంచి పెళ్లైన కూతురు కూడా అర్హురాలే..
Allahabad High Court
Follow us on

Allahabad High Court: ప్రతి కుటుంబంలో సాధారణంగా తండ్రి తరువాత అన్నింటికి అర్హుడుగా ఆయన కొడుకునే భావిస్తారు. భారతదేశం కుటుంబ వ్యవస్థలో అనాదిగా ఇదే విధానం సాగుతోంది. తండ్రి తరువాత అతని ఆస్తి వారసత్వ హక్కు కింద అతని కొడుక్కి చెందడం.. లేదంటే.. తండ్రి చనిపోతే అతని ఉద్యోగం కొడుక్కి ఇవ్వడం వంటివి మన సమాజంలో పరిపాటి. కూతురు ఉన్న ఆమెకు వీటిని వర్తింపజేయరు. ఈ విధానాలను అనాదిగా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విధానానికి అలహాబాద్ కోర్టు స్వస్తి పలికుతూ కీలక తీర్పునిచ్చింది. కారుణ్య నియామాకానికి సంబంధించి తీర్పు చెబుతూ.. కొడుకుతో పాటు కూతురు కూడా అన్నింటికీ అర్హురాలే అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అసలు విషయంలోకెళితే.. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లైన కూతురిని కుటుంబంలో సభ్యురాలిగా గుర్తించరాదంటూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్డర్ జారీ చేశారు. దీనిని సవాల్ చూస్తూ మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో కొడుకునే ఏవిధంగా చూస్తారో.. పెళ్లైన కూతురిని కూడా అలాగే చూడాలని వ్యాఖ్యానించింది. ఇంట్లో కొడుకుకి పెళ్లి అయినప్పటికీ కుటుంబ సభ్యుడిగానే చూస్తారని, అలాగే కూతురుని కూడా చూడాలని ధర్మాసనం పేర్కొంది. పైళ్లి అయినప్పటికీ కొడుకు అన్నింటికీ అర్హుడైనప్పుడు.. కూతురును ఎందుకు వేరుగా చూస్తారు? అని జస్టిస్ జేజే మునిర్ ధర్మాసనం ప్రశ్నించింది. కారుణ్య నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలే.. పెళ్లైన కూతురుకి కూడా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సదరు అధికారి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.
Also read:

TRP Scam: టీఆర్‌పీ కుంభకోణం కేసులో ఊహించని మలుపు.. అర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ సందేశాలు లీక్‌..!

TDP vs BJP: ఆంధ్రాలో రసవత్తర రాజకీయం.. పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కళా వెంకట్రావు..