Al Zawahiri Alive: భయంకరమైన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా(Al Qaeda)లో నంబర్ 2 గా పరిగణిస్తున్న ఐమాన్ అల్ జవహిరి(Ayman Al-Zawahiri) సజీవంగా ఉన్నాడు. ఒసామా బిన్ లాడెన్ తర్వాత ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న అల్ జవహిరి మరణ వార్త 2020 సంవత్సరంలో వచ్చింది. అయితే అది అబద్ధమని తేలిపోయింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో మళ్లీకనిపించాడు. ఈ వీడియో గత వారం రోజుల క్రితం చేసినట్టు చెబుతున్నారు. కొత్త వీడియోలో జవహిరిని చూసిన తర్వాత, ఆతని గురించి మరోసారి చర్చ తీవ్రమైంది. ఈసందర్భంగా భారతదేశ హిజాబ్ వివాదం(Hijab Controversy)పై ఆయన విషం చిమ్మారు.
అల్ ఖైదా అధికారిక మీడియా విభాగం అస్ సాహబ్ మీడియా 9 నిమిషాల వీడియోను విడుదల చేసింది. ఇందులో కర్నాటకలోని ఒక కళాశాలలో హిజాబ్ ధరించి కనిపించిన ముస్లిం విద్యార్థి ముస్కాన్‌ను అల్ జవహిరి ప్రశంసించాడు. అతడి వీడియో కూడా వైరల్‌గా మారింది. జవహిరి వీడియో ప్రభుత్వేతర ఉగ్రవాద వ్యతిరేక సంస్థ SITE ఇంటెలిజెన్స్ ధృవీకరించింది. SITE ఇంటెలిజెన్స్ అందించిన అనువాదంలో, జవహిరి ముస్కాన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ కనిపించాడు. కర్నాటకలోని కళాశాలల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారితో కలిసి ముస్కాన్ నినాదాలు చేశాడు. జవహిరి ముస్కాన్ కోసం ఒక పద్యం కూడా రాశారు. ఆమెను తన సోదరిగా అభివర్ణించారు. అందులో ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ది నోబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా.. ముస్కాన్ పని గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నానని ఉగ్రవాది జవహిరి తెలిపాడు.
దేశంలోని ముస్లింలపై ప్రభుత్వం అఘాయిత్యాలకు పాల్పడుతోందని ఉగ్రవాది జవహిరి ఆరోపించారు. హిజాబ్ వివాదంపై భారత ముస్లింలు స్పందించాలని ఆయన కోరారు. భారత్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై అల్‌ఖైదా నిఘా ఉంచినట్లు ఈ వీడియో పేర్కొన్నారు. ఈ 9 నిమిషాల వీడియోను అల్ ఖైదా అధికారిక మీడియా విభాగం అస్ సాహబ్ విడుదల చేసింది.
విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించరాదన్న నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు గత నెలలో సమర్థించింది. హిజాబ్ ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని కోర్టు పేర్కొంది. తన వీడియోలో, అల్ ఖైదా నాయకుడు ప్రపంచంలోని అనేక దేశాల హిజాబ్ విధానాలను విమర్శించారు. హిజాబ్‌కు సంబంధించి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ విధానాలను విమర్శిస్తూనే, ఈజిప్ట్, మొరాకో హిజాబ్ వ్యతిరేక విధానాలపై దాడి చేశాడు. పాక్, బంగ్లాదేశ్‌లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది జవహిరి మాట్లాడుతూ.. ఈ రెండు దేశాలు పాశ్చాత్య దేశాలతో పోరాడే బదులు అంతర్గ కుమ్ములాటలకే ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.
#AlQaeda leader Ayman al-#Zawahiri is ALIVE:
In a nine-minute video released by As-Sahab Media, Al-Qaeda’s official media wing, al-Zawahiri praised Muslim student #Muskan Khan after she wore the Islamic #Hijab at a school in #Karnataka state pic.twitter.com/hlUEAnU3ae
— Dr. Sandeep Seth Ukraine@War #РОССИЯ-#УКРАИНА (@sandipseth) April 6, 2022
ఇప్పటి వరకు, జవహిరి చనిపోయాడని నమ్ముతారు, అయితే గత సంవత్సరం అతను ఒక వీడియోను విడుదల చేయడం ద్వారా ఆ పుకార్లను తిప్పికొట్టాడు. ఆ వీడియోలో.. జెరూసలేం ఎప్పటికీ యూదులకు చెందదని సిరియాలో రష్యా సైన్యంపై జరిగిన దాడిని కొనియాడాడు. అల్ ఖైదాలో ఒసామా బిన్ లాడెన్ తర్వాత జవహిరి రెండవ స్థానంలో ఉన్నాడు. లాడెన్ మరణం తర్వాత జవహిరి ఇప్పుడు అల్ ఖైదా చీఫ్‌గా ఉన్నాడు. అతడిపై అమెరికా 25 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. అతను చివరిగా చూసిన వీడియో 9/11 ఉగ్రదాడుల 20వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించబడింది. ఇంత భయంకరమైన, ఆడంబరమైన ఆలోచన కలిగిన ఈ ఉగ్రవాది ఈజిప్ట్‌లో పుట్టి డాక్టర్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2011లో బిన్ లాడెన్ మరణం తర్వాత అతను అల్ ఖైదాను నిర్వహించడం ప్రారంభించాడు.
Read Also…. Azim Premji: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న అజీమ్ ప్రేమ్‌జీ.. ప్రభుత్వ పనితీరుపై కితాబు..