అజిత్ పవార్‌తో ప్రయాణం.. పింకీ మాలి చివరి మాటలు వెలుగులోకి

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జనవరి 28 బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ముంబై నుండి బారామతికి ప్రైవేట్ చార్టర్ విమానంలో ప్రయాణిస్తున్నారు. విమానం ల్యాండింగ్‌కు కొద్దిక్షణాల ముందు కూలిపోయింది. అజిత్ పవార్, మరో నలుగురు మరణించారు. ఇద్దరు సిబ్బంది, పవార్ సహచరులు ఇద్దరు కూడా విమానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పింకీ మాలి కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అయితే, ఎవరీ పింకి మాలి..? ఆమె తండ్రితో పింకీ మాలీ చివరి కాల్‌లో ఏం మాట్లాడిందో తెలుసా..?

అజిత్ పవార్‌తో ప్రయాణం.. పింకీ మాలి చివరి మాటలు వెలుగులోకి
Pinky Mali Last Call

Updated on: Jan 28, 2026 | 8:59 PM

మహారాష్ట్ర బారామతి ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో సహా ఐదుగురు మరణించారు. వీరిలో పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ నడిపించగా, పింకీ మాలి అనే మరో విమాన సహాయకురాలు కూడా ఉన్నారు. ఫ్లయిట్ అటెండర్ గా పింకీకి ఎంతో అనుభవం ఉంది. పింకీ మాలి కుటుంబం ఈ విషాదంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆమె తండ్రి శివకుమార్‌ మాలి జనవరి 27 మంగళవారం రోజున తన కూతురితో మాట్లాడానని చెప్పారు. తీవ్ర భావోద్వేగానికి గురైన శివకుమార్ మాలి.. తన కూతురు రేపు మాట్లాడతాను నాన్న అని చెప్పిందని గుర్తు చేసుకుని రోధించారు. తన కుమార్తె ఇకపై తనతో మాట్లాడదని శివకుమార్ గుండెలవిసేలా రోధించారు. పింకీ మాలి తండ్రితో మాట్లాడిన చివరి మాటలు ఇలా ఉన్నాయి.

చివరి కాల్‌లో పింకీ ఏం చెప్పింది?

ముంబై సెంట్రల్‌లోని ప్రభాదేవి నివాసి అయిన శివకుమార్ తన కుమార్తెతో తన చివరి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా పింకీ తనతో ఇలా చెప్పిందని.. నాన్నా, నేను రేపు (బుధవారం) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో బారామతికి వెళ్తున్నాను. అతన్ని దింపిన తర్వాత, నేను నాందేడ్‌కు వెళ్లి హోటల్‌కు చేరుకున్న వెంటనే మీతో మాట్లాడతాను’ అని చెప్పిందని అన్నారు. పింకీ మాలి VSR వెంచర్స్ నడుపుతున్న లియర్‌జెట్ 46 విమానంలో విమాన సహాయకురాలు. అజిత్ పవార్, మరో నలుగురిని తీసుకువెళుతున్న విమానం ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు కూలిపోయింది.

ఇవి కూడా చదవండి

శివకుమార్ చివరిసారిగా జనవరి 16న తన కుమార్తెను కలిశారు. ఆ రోజు, పింకీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి థానే నుండి ప్రభాదేవికి వచ్చింది. వారు తరచుగా మాట్లాడుకునేవారని శివకుమార్ చెప్పారు. పింకీ గత ఐదు సంవత్సరాలుగా విమాన సహాయకురాలిగా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఆమె ఎయిర్ ఇండియాతో ప్రారంభించి, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రైవేట్ చార్టర్డ్ విమానాలకు మారిందని చెప్పారు. తన కుమార్తె పింకీ రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, అనేక మంది రాజకీయ నాయకులతో ప్రయాణించిందని శివకుమార్ మాలి అన్నారు. అజిత్ పవార్‌తో ఇది ఆమె నాల్గవ పర్యటన అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..