Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. జనావాసాల్లో కూలిన ఎయిర్‌ ఇండియా ఫ్లైట్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. జనావాసాల్లో కూలిన ఎయిర్‌ ఇండియా ఫ్లైట్
Air India Plane Crash

Edited By:

Updated on: Jun 12, 2025 | 2:29 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు.

అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం వెనుక భాగం చెట్టును ఢీకొట్టిందని సమాచారం. విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. కాగా, ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

లైవ్ వీడియో చూడండి..

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.