ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా.. వారికి 50శాతం రాయితీ కల్పించిన సంస్థ

|

Dec 16, 2020 | 10:48 PM

ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ కలిపిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా.. వారికి 50శాతం రాయితీ కల్పించిన సంస్థ
Air India
Follow us on

ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు రాయితీ కలిపిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తులకు తమ టికెట్‌ ధరలో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ సౌలభ్యం దేశీయవిమానాలకు మాత్రమే వర్తిస్తుందని నిబంధన పెట్టింది ఎయిర్ ఇండియా. భారత్‌లో నివసిస్తున్న అరవై ఏళ్లకు పైబడిన వారు ఈ ఆఫర్‌కు అర్హులని తెలిపింది. ప్రయాణం చేసే నాటికి వారికి 60 ఏళ్లు ఉండాలని వారు పేర్కొంది.ఈ మేరకు తన వెబ్ సైట్ లో ఓ ప్రకటన విడుదల చేసింది ఎయిర్ ఇండియా. టికెట్ బుక్ చేసుకునే సమయంలో గుర్తింపు కార్డును చూపించి వారి వయసును నమోదు చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఓటరు కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్‌ సిటిజన్‌ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని తెలిపింది. ఒక వేళ తనిఖీల సమయంలో సరైన గుర్తింపు కార్డులను సమర్పించకపోతే పూర్తి టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది ఎయిర్ ఇండియా సంస్థ.