ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్..

|

Oct 14, 2024 | 9:59 AM

న్యూయార్క్‌లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి AI 119 అనే విమానం ముంబై నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత బాంబు బెదిరింపు రావడంతో వెంటనే ఫైలెట్స్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. విమానం ప్రస్తుతం..

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్..
Air India
Follow us on

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ముంబయి నుంచి న్యూయార్క్‌ బయలుదేరిన ఎయిర్​ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపునకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

న్యూయార్క్‌లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి AI 119 అనే విమానం ముంబై నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత బాంబు బెదిరింపు రావడంతో వెంటనే ఫైలెట్స్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది.

కాగా, గత నెలలో ముంబైకి చెందిన మరో ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో దాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానం వాష్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై రాసివున్న బాంబ్ ఇన్ ఫ్లైట్ అనే మేసేజ్‌ను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..