Air India cancels flights: దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇంగ్లాండ్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు భారత్-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది.
‘‘భారత్, యూకే మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు గమనిక.. యూకే ఇటీవల ప్రకటించిన ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నాం. ఈనెల 24 నుంచి 30వ తేదీల్లో ఢిల్లీ, ముంబయి నుంచి యూకేకు వారానికి ఒక విమానాన్ని నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెబ్‌సైట్, మా సోషల్‌మీడియా ఛానళ్లలో అప్‌డేట్ చేస్తాం. విమానాల రీషెడ్యూలింగ్, రీఫండ్ తదిరత వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తాం’’అని ఎయిరిండియా బుధవారం ట్వీట్ చేసింది.
Dear Mr. Venkatesh, Due to restrictions imposed by UK Govt. flights to/from UK has been cancelled from 24th to 30th Apr’21. Information regarding waiver and rescheduling will be informed shortly.
— Air India (@airindiain) April 21, 2021
భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ఇటీవల భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించింది. ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా వేస్తున్నారు. అంతేకాదు, ప్రయాణాల విషయంలో భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో చేర్చిన యూకే.. ఆ దేశం నుంచే వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరింయా పేర్కొంది.
Read Also.. Corona: దారుణం.. కరోనా సోకిందని ఇంట్లో నుంచి బయటకు పంపిన యజమాని.. శ్మశానంలో తల్లీకొడుకులు..