ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కుట్ర కోణం..? విదేశాలకు బ్లాక్‌బాక్స్ పంపబోమన్న కేంద్రం!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం వెనుక వెనుక కుట్రకోణం ఉండే అవకాశాలున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కుట్ర కోణంపై కూడా దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో చేపట్టిందని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కుట్ర కోణం..? విదేశాలకు బ్లాక్‌బాక్స్ పంపబోమన్న కేంద్రం!
Mos Civil Aviation Murlidhar Mohol

Updated on: Jun 29, 2025 | 7:50 PM

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో కుట్ర కోణం తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రమాదం వెనుక వెనుక కుట్రకోణం ఉండే అవకాశాలున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కుట్ర కోణంపై కూడా దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో చేపట్టిందని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు బ్లాక్ బాక్స్‌ను డేటా విశ్లేషణ కోసం విదేశాలకు పంపుతారనే వార్తలపై కూడా కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. విదేశాలకు పంపే ప్రసక్తి లేదని, భారత్‌లోనే బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ జరుగుతుందన్నారు. రెండు ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోవడం అత్యంత అరుదైన ఘటన అని తెలిపారు. ఇంజిన్ ఫెయిల్యూర్, ఇంధన సరఫరా లోపం లేదా ఇతర సాంకేతిక కారణాలవల్ల ఈ ప్రమాదం జరిగిందో నివేదిక ద్వారా తెలుస్తుందని ఆయన అన్నారు. నివేదిక మూడు నెలల్లో రానుందన్నారు. AI 171 ప్రమాదం తరువాత DGCA అన్ని డ్రీమ్‌లైనర్ విమానాలను పరిశీలించిందని ఎలాంటి లోపాలు లేవని తేల్చిందన్నారు. ప్రజలు ఇప్పుడు భయపడటం లేదని, వారు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు.

డీజీసీఏ 419 సాంకేతిక సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంపై పనిచేస్తున్నట్లు కేంద్ర మంత్రి మురళీధర్ వెల్లడించారు. ప్రైవేటు విమానయాన సంస్థలు సొంతగా ఎవర్నీ నియమించుకోకూడదని.. డీజీసీఏ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆయా సంస్థలు సుదీర్ఘ సమయం పనిచేయాలని పైలట్లపై ఒత్తిడి చేసి వేధిస్తే.. డీజీసీఏను సంప్రదించాలని సూచించారు మంత్రి మురళీధర్‌ మోహోల్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..