MIG 21 Crash: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐఏఎఫ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్ల దుర్మరణం

|

Jul 28, 2022 | 11:44 PM

రత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం గురువారం రాత్రి కుప్పకూలింది. బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-21

MIG 21 Crash: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐఏఎఫ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్ల దుర్మరణం
Iaf Plane
Follow us on

Air Force’s Fighter Jet Crash: రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం గురువారం రాత్రి కుప్పకూలింది. బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. యుద్ధ విమానం కుప్పకూలిన అనంతరం భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఇద్దరు పైలెట్లు మరణించారు. విమాన శిధిలాలు ఒక కిలోమీటరు వరకు చెల్లాచెదురుగా పడ్డాయి.

IAF విమానం బైతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయినట్లు బార్మర్ జిల్లా కలెక్టర్ లోక్ బందు వెల్లడించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

బార్మర్‌లో మిగ్-21 యుద్ధ విమానం కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. ఈ ఘటనపై ఐఏఎఫ్ చీఫ్ ఆయనకు వివరంగా వివరించారు. పైలట్లు మృతి చెందడంపై రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తంచేశారు.

మిగ్‌-21 ప్రమాదంపై భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వాయుసేన వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..