సుశాంత్ కేసులో మా దర్యాప్తే సరైనదని తేలింది, ముంబై పోలీస్ !

సుశాంత్ కేసులో తమ ఇన్వేస్టిగేషనే సరైనదని ఢిల్లీ ఎయిమ్స్ నివేదిక ద్వారా తేలిందని ముంబై పోలీస్ చీఫ్ పరం వీర్ సింగ్ తెలిపారు.  సుశాంత్ ది హత్య కాదని, సూసైడేనని ఎయిమ్స్..

సుశాంత్ కేసులో మా దర్యాప్తే సరైనదని తేలింది, ముంబై పోలీస్ !

Edited By:

Updated on: Oct 03, 2020 | 8:27 PM

సుశాంత్ కేసులో తమ ఇన్వేస్టిగేషనే సరైనదని ఢిల్లీ ఎయిమ్స్ నివేదిక ద్వారా తేలిందని ముంబై పోలీస్ చీఫ్ పరం వీర్ సింగ్ తెలిపారు.  సుశాంత్ ది హత్య కాదని, సూసైడేనని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం స్పష్టం చేసిందన్నారు. కానీ తమకు మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందన్నారు. సుశాంత్ ది ఆత్మహత్యే అన్న కోణంలో తాము దర్యాప్తు చేశామన్నారు. మా పోలీసులు, కూపర్ ఆసుపత్రి డాక్టర్ల ఇన్వెస్టిగేషన్లు కరెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. మా మీద ఎన్నో ఆరోపణలు చేశారు.. కానీ ఎయిమ్స్ రిపోర్టు మా దర్యాప్తే సరైనదని తేల్చిందన్నారు. మొదటి నుంచీ తాము తమ కోణంలోనే దర్యాప్తు చేస్తూ వచ్చామన్నారు. దేశంలో తమ పోలీసు శాఖకు ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే అని పరం వీర్ సింగ్ పేర్కొన్నారు.